Telugu Global
Cinema & Entertainment

అనుష్క లిస్ట్ పెరుగుతుంది

హీరోయిన్ అంటే హీరోలతో ఆడిపాడడానికే మాత్రమే కాదని ‘హీరో’యిన్‌లలోనూ ‘హీరో’ వుంటుందని ప్రూవ్ చేసిన నటి అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి ప్రత్యేకమైన సినిమాలలో తనదైన అభినయంతో ప్రేక్షకుల జేజేలు అందుకుంటున్న జేజమ్మ తాజాగా మరో నాయికా ప్రధాన చిత్రానికి సంతకం చేసిందట. అదీ దిల్ రాజు నిర్మాణంలో. మిగతా వివరాలు తెలియాల్సి వుంది. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సైజ్‌జీరో సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. మరోవైపు బాహుబలి2 తోపాటు భాగుమతి సినిమా […]

అనుష్క లిస్ట్ పెరుగుతుంది
X

హీరోయిన్ అంటే హీరోలతో ఆడిపాడడానికే మాత్రమే కాదని ‘హీరో’యిన్‌లలోనూ ‘హీరో’ వుంటుందని ప్రూవ్ చేసిన నటి అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి ప్రత్యేకమైన సినిమాలలో తనదైన అభినయంతో ప్రేక్షకుల జేజేలు అందుకుంటున్న జేజమ్మ తాజాగా మరో నాయికా ప్రధాన చిత్రానికి సంతకం చేసిందట. అదీ దిల్ రాజు నిర్మాణంలో. మిగతా వివరాలు తెలియాల్సి వుంది. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సైజ్‌జీరో సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది. మరోవైపు బాహుబలి2 తోపాటు భాగుమతి సినిమా కూడా అనుష్క చేయాల్సిన సినిమాల లిస్టులో వుంది. ఆ లిస్టులో ఇప్పుడు మరో సినిమా వచ్చి చేరింది. అంతా బాగానే వుంది కానీ, కొన్నాళ్ళు ఈ ఏకపాత్రాభినయం మానేసి మునుపటిలా గ్లామర్ పాత్రలు చేయాలన్న అనుష్క కోరిక మాత్రం తీరటం లేదు. ప్చ్..!

First Published:  13 Nov 2015 12:34 AM IST
Next Story