Telugu Global
Others

జంక్షన్‌లో ఆనం.. కాంగ్రెస్ నాట్ ఓకే అట!

మొన్నటి ఎన్నికల తర్వాత మౌనంగా ఉంటున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనం రామనారాయణరెడ్డి నోరు విప్పారు. నేరుగా సొంతపార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేస్తున్న మట్టి సత్యాగ్రహంపై సెటైర్లు వేశారు. అది మట్టి సత్యాగ్రహం కాదు.. ఒట్టి సత్యాగ్రహం అని ఎద్దేవా చేశారు. ఒక పని చేస్తే ఉపయోగం ఉండాలి కానీ… మట్టి సత్యాగ్రహం వల్ల నో యూజ్ అని తేల్చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నోట్లో తొలుత మట్టి కొట్టింది కాంగ్రెస్‌ పార్టీనే కదా.. మనమే మట్టి కొట్టి, మనమే […]

జంక్షన్‌లో ఆనం.. కాంగ్రెస్ నాట్ ఓకే అట!
X

మొన్నటి ఎన్నికల తర్వాత మౌనంగా ఉంటున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనం రామనారాయణరెడ్డి నోరు విప్పారు. నేరుగా సొంతపార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేస్తున్న మట్టి సత్యాగ్రహంపై సెటైర్లు వేశారు. అది మట్టి సత్యాగ్రహం కాదు.. ఒట్టి సత్యాగ్రహం అని ఎద్దేవా చేశారు. ఒక పని చేస్తే ఉపయోగం ఉండాలి కానీ… మట్టి సత్యాగ్రహం వల్ల నో యూజ్ అని తేల్చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ నోట్లో తొలుత మట్టి కొట్టింది కాంగ్రెస్‌ పార్టీనే కదా.. మనమే మట్టి కొట్టి, మనమే మట్టి సత్యాగ్రహం అని అంటే ఎలా.?’ అని ప్రశ్నించారు.

ఆనం ఈ స్టేట్‌మెంట్ ఇచ్చిన వెంటనే పలు టీవీచానళ్ల వాళ్లు ఆయన చుట్టూ చేరి ప్రత్యేక ఇంటర్వ్యూలు చేశారు. ఆ సమయంలో తన పొలిటికల్ కేరీర్‌పైనా కాసింత క్లారిటీ ఇచ్చారు ఆనం. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో ఉంటూ ప్రజాసేవ చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. తమ కుటుంబం మాత్రం రాజకీయాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ప్రజాసేవ చేయాలంటే ఒక పార్టీ అన్నది కావాలంటూ పరోక్షంగా పార్టీ మారడం ఖాయమని చెప్పేశారు. అయితే తన అన్న ఆనం వివేకానందరెడ్డితో పాటు ఇతర కుటుంబసభ్యులు, కార్యకర్తలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తం మీద ఆనం బ్రదర్స్ పార్టీ మారడం అయితే ఖాయమంటున్నారు వారి సన్నిహితులు. మరి ఏ పార్టీలోకి వెళ్తారు?. టీడీపీయా లేక వైసీపీయా అన్నది త్వరలోనే తేలే అవకాశం ఉంది.

First Published:  13 Nov 2015 12:09 PM GMT
Next Story