Telugu Global
Others

ఈ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపేశారు

ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిపేరు రోక్షానా. ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు. ఆమె తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఆమె అభీష్టానికి విరుధంగా ఒక ముసలివాడితో పెళ్ళినిశ్చయించారు. ఆ అమ్మాయి పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదని వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. మత పెద్దలు రంగంలోకి దిగారు. ఆ అమ్మాయిని పట్టుకొచ్చారు. తాలిబాన్‌ కోర్టులో ఆ అమ్మాయికి రాళ్ళతోకొట్టి చంపే శిక్ష విధించారు. రెండువారాల క్రితం సెంట్రల్‌ ఆఫ్ఘనిస్థాన్‌లో ఆ శిక్ష అమలైంది. ఒక కొండప్రాంతంలో, నిర్జన ప్రదేశంలో నాలుగు […]

ఈ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపేశారు
X

ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిపేరు రోక్షానా. ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు. ఆమె తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఆమె అభీష్టానికి విరుధంగా ఒక ముసలివాడితో పెళ్ళినిశ్చయించారు. ఆ అమ్మాయి పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదని వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. మత పెద్దలు రంగంలోకి దిగారు.

o-ROKSHANA-facebookఆ అమ్మాయిని పట్టుకొచ్చారు. తాలిబాన్‌ కోర్టులో ఆ అమ్మాయికి రాళ్ళతోకొట్టి చంపే శిక్ష విధించారు. రెండువారాల క్రితం సెంట్రల్‌ ఆఫ్ఘనిస్థాన్‌లో ఆ శిక్ష అమలైంది. ఒక కొండప్రాంతంలో, నిర్జన ప్రదేశంలో నాలుగు అడుగుల గుంటతీసి అందులోకి ఆ అమ్మాయిని తోసి చుట్టూత మతపెద్దలు, స్థానిక గిరిజనపెద్దలు, తాలిబాన్‌లు చేరి ఆ అమ్మాయిమీద రాళ్ళవర్షం కురిపించారు. ఏ తప్పుచేయలేదని ఆ అమ్మాయి ఎంత హృదయవిదారకంగా రోధిస్తున్నా పట్టించుకోకుండా ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టిచంపేశారు.
ఈ సంఘటనను చిత్రించి ఆ వీడియోను ఎవరో యూట్యూబ్‌లో పెట్టారు. ఈ హృదయ విదారక ఘటనను చూశాక ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా మహిళలు నిరసనను తెలియజేస్తున్నారు. ఈవిధంగా శిక్షకు గురైన ఒక స్త్రీ జీవితాన్ని చిత్రించిన “ది స్టోనింగ్ ఆఫ్ సురాయ.ఎం” ( The Stoning of Soraya M.) అనే సినిమా చూసినవాళ్లకు ఈ సంఘటన గురించి వింటే, ఆ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో గుర్తుకువచ్చి భయంతో వణికిపోతారు.

First Published:  13 Nov 2015 11:32 AM IST
Next Story