గూగుల్ వర్సెస్ ఫేస్ బుక్
గూగుల్, ఫేస్ బుక్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరికి ఏదో ఒక అకౌంట్ ఉండడం గ్యారెంటీ. గూగుల్, ఫేస్ బుక్ లు ఆస్థాయిలో మనపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరెండు సంస్థలు ఓ విషయంలో పోటీ పడితున్నాయి. అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఇప్పటికే ఇంటర్నెట్ ప్రతి ఇంట్లో నిత్యావసరంగా మారిపోయింది. అయితే ఇంటర్నెట్ వినియోగం కేవలం పట్టణాలకే […]
BY admin12 Nov 2015 6:39 AM IST
X
admin Updated On: 12 Nov 2015 6:39 AM IST
గూగుల్, ఫేస్ బుక్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరికి ఏదో ఒక అకౌంట్ ఉండడం గ్యారెంటీ. గూగుల్, ఫేస్ బుక్ లు ఆస్థాయిలో మనపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరెండు సంస్థలు ఓ విషయంలో పోటీ పడితున్నాయి. అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది.
ఇప్పటికే ఇంటర్నెట్ ప్రతి ఇంట్లో నిత్యావసరంగా మారిపోయింది. అయితే ఇంటర్నెట్ వినియోగం కేవలం పట్టణాలకే పరిమితం అయింది. గ్రామాల్లో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. దీన్నే అవకాశంగా తీసుకుని ఇంటర్నెట్ ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు గూగుల్, ఫేస్ బుక్ లు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆకాశంలో డ్రోన్లతో ఫేస్‌బుక్, బెలూన్ లతో గూగుల్ ఇప్పటికే ఇంటర్నెట్ వినియోగంపై ప్రయోగాలు చేశాయి.
గూగుల్ కంపెనీ హీలియంతో రూపొందించిన బెలూన్ల సాయంతో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడంపై ప్రయోగాలు చేస్తోంది. సోలార్ విద్యుత్ సాయంతో గాలిలో ఎగురుతూ ఇంటర్నెట్ నెట్‌వర్క్ ను అందుబాటులోకి తీసుకురావడమే ఈ బెలూన్ ల పని. భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లతో మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించడం కోసం ఉపయోగిస్తారు. వీటిపై ఇప్పటికే పలు దేశాల్లో ప్రయోగాలు పూర్తయ్యాయి.
మరోవైపు ఫేస్ బుక్ కూడా గూగుల్ కు పోటీగా ప్రయోగాలు చేస్తోంది. అందరికీ ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్‌తో డ్రోన్‌లు సిద్ధం చేస్తోంది. మానవ రహిత విమానాలతో భూమ్మీద ఎక్కడ కావాలంటే అక్కడ నెట్ సౌకర్యం కల్పించే ప్రయోగాల్లో ఫేస్‌బుక్ టీమ్ నిమగ్నమైంది. ఇంగ్లండ్‌లో డ్రోన్ల తయారీ ఇప్పటికే పూర్తయింది. వీటిని రహస్య ప్రాంతంలో విజయవంతంగా ప్రయోగించినట్టు సమాచారం. డ్రోన్ భూమికి 18 నుంచి 27 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ.. 200 కిలోమీటర్ల వరకు ఇంటర్నెట్ అందించే వీలుంటుందని ఫేస్‌బుక్ అంచనా వేస్తోంది.
సెకనుకు 10 జీబీ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించేలా ఫేస్‌బుక్ డ్రోన్లు, గూగుల్ బెలూన్స్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగంపై గూగుల్, ఫేస్ బుక్ చేస్తున్న ప్రయోగాలు పూర్తి స్థాయిలో విజయవంతం అయితే సరికొత్త సాంకేతిక విప్లవం వచ్చినట్టే.
Next Story