ఈయన్ను చంపేస్తారట!
ప్రముఖనటుడు గిరీష్ కర్నాడ్‌కు బెదిరింపులొచ్చాయి. చంపేస్తామంటూ కొందరు ఆయనను హెచ్చరించారు. బెంగళూరు విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఆయన సూచించడమే బెదిరింపులకు కారణం. ప్రస్తుతం బెంగళూరు విమానాశ్రయానికి కంపెగౌడ పేరు ఉంది. మంగళవారం నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల సందర్భంగా గిరీష్ కర్నాడ్ ఈ సూచన చేశారు. దీంతో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. హిందువులను, వక్కలింగ వర్గం మనోభావాలను గిరీష్ దెబ్బతీశారంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. వివాదం చాలా దూరం వెళ్లడంతో […]

ప్రముఖనటుడు గిరీష్ కర్నాడ్‌కు బెదిరింపులొచ్చాయి. చంపేస్తామంటూ కొందరు ఆయనను హెచ్చరించారు. బెంగళూరు విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఆయన సూచించడమే బెదిరింపులకు కారణం. ప్రస్తుతం బెంగళూరు విమానాశ్రయానికి కంపెగౌడ పేరు ఉంది. మంగళవారం నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల సందర్భంగా గిరీష్ కర్నాడ్ ఈ సూచన చేశారు. దీంతో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. హిందువులను, వక్కలింగ వర్గం మనోభావాలను గిరీష్ దెబ్బతీశారంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. వివాదం చాలా దూరం వెళ్లడంతో వెంటనే గిరిష్ కర్నాడ్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. తన మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదని చెప్పారు.