Telugu Global
Others

గండికోటకు నీరెప్పుడు.... గడ్డం గీసేదెప్పుడు?

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఆవేశంలో చేసిన శపథం ఇప్పుడు ఆయన్ను వెంటాడుతోంది. మాసిన పొడుగాటి గడ్డం… చెదిరిపోయిన క్రాప్‌తో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటంటే… కడప జిల్లాలో సాగునీటికి చాలా ఏళ్లుగా సమస్య ఉంది. దీన్ని నివారించేందుకు వైఎస్ హయాంలో గండికోట రిజర్యాయర్‌కు నీరు తెచ్చే ప్రయ్నతాలు వేగవంతం చేశారు.  అయితే వైఎస్ చనిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. గతేడాది ముఖ్యమంత్రి […]

గండికోటకు నీరెప్పుడు.... గడ్డం గీసేదెప్పుడు?
X

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఆవేశంలో చేసిన శపథం ఇప్పుడు ఆయన్ను వెంటాడుతోంది. మాసిన పొడుగాటి గడ్డం… చెదిరిపోయిన క్రాప్‌తో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ మ్యాటరేంటంటే… కడప జిల్లాలో సాగునీటికి చాలా ఏళ్లుగా సమస్య ఉంది. దీన్ని నివారించేందుకు వైఎస్ హయాంలో గండికోట రిజర్యాయర్‌కు నీరు తెచ్చే ప్రయ్నతాలు వేగవంతం చేశారు. అయితే వైఎస్ చనిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. గతేడాది ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఓసారి కడపకు వెళ్లి రెండు నెలల్లో గండికోటకు నీరు తెస్తామని ప్రకటన చేశారు.

అయితే బాబు చెప్పిన డెడ్‌లైన్ కూడా ముగిసిపోవడంతో విపక్షాల నుంచి విమర్శల పరంపర మొదలైంది. దీంతో సతీష్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. అంతే ఆ మధ్య కడపలో ఒక శపథం చేసేశారు. గండికోట రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చే వరకు తాను గడ్డం తీయనని, తలనీలాలు కూడా కట్ చేయించనని శపథం చేశారు. అది జరిగి ఐదు నెలలైంది. కానీ గండికోట దరిదాపుల్లోకి కూడా నీళ్లు రాలేదు. కాలువ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. సతీష్ రెడ్డి గడ్డం మాత్రం ఏపుగా పెరుగుతూనే ఉంది.

తాజాగా సోమవారం కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు గండికోటకు వచ్చే ఏడాది నీళ్లిస్తామని ప్రకటించారు. ఏ నెల అని మాత్రం చెప్పలేదు. చంద్రబాబు మీటింగ్‌లో సతీష్ రెడ్డి కూడా పెరిగిన జుట్టు, గడ్డంతో స్టేజ్ మీదే కనిపించారు. సతీష్ రెడ్డి చూసిన అభిమానులు బాధపడుతున్నారు. ఆ గండికోటకు నీళ్లు వచ్చేదెప్పుడు తమ నేతను గ్లామర్ లుక్‌తో చూసేదెప్పుడని ఫీలవుతున్నారు. అంతే మరీ మన చేతుల్లో లేని పనికి శపథాలు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది.

First Published:  10 Nov 2015 3:13 PM IST
Next Story