మేమూ అవార్డులు వెనక్కిస్తాం
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అసహన నినాదం ఇప్పుడు మాజీ సైనికులకూ చేరింది. మొన్నటి వరకు కవులు, రచయితలు, సినీ కళారులు అవార్డులను తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు అదే దారిలో మాజీ సైనికులు రెడీ అయ్యారు. వన్ ర్యాంక్- వన పెన్షన్ కోసం పోరాటం చేస్తున్న మాజీ సైనికులు ఇవాళ్టి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. నేటి నుంచి సైన్యంలో పనిచేసినపుడు సాధించిన మెడల్స్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద […]
BY sarvi10 Nov 2015 8:34 AM IST
X
sarvi Updated On: 10 Nov 2015 8:34 AM IST
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అసహన నినాదం ఇప్పుడు మాజీ సైనికులకూ చేరింది. మొన్నటి వరకు కవులు, రచయితలు, సినీ కళారులు అవార్డులను తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు అదే దారిలో మాజీ సైనికులు రెడీ అయ్యారు. వన్ ర్యాంక్- వన పెన్షన్ కోసం పోరాటం చేస్తున్న మాజీ సైనికులు ఇవాళ్టి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. నేటి నుంచి సైన్యంలో పనిచేసినపుడు సాధించిన మెడల్స్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద తమ మెడల్స్‌ను తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ప్రారంభిస్తామని ఇండియన్ ఎక్స్‌సర్వీస్‌మెన్ మూవ్‌మెంట్ ప్రధాన కార్యదర్శి గ్రూప్ కెప్టెన్ వి.కె. గాంధీ తెలిపారు. మహాత్ముడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించారని, అదే స్పూర్తితో ఎక్స్ సర్వీస్‌మెన్ లు తమ మెడల్స్‌ను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించిన్నట్టు చెప్పారు.
నిజానికి వన్ ర్యాంక్- వన్ పెన్షన్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను మాజీ సైనికులు తిరస్కరించారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ఓఆర్‌ఓపి నిర్వచనాన్నే మార్చేసిందని మాజీ సైనికులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఒక సీనియర్ తన జూనియర్‌కంటే ఎక్కువ పెన్షన్‌ను పొందలేడని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అని పేరుతోనే ఉన్నా.. మాజీ సైనికులు మాత్రం సీనియర్లు, జూనియర్లు అన్న తేడా ఉండాల్సిందేనన్న వాదన తెరపైకి తెస్తున్నారు. మరి కేంద్ర ప్రబుత్వం వీరి పట్ల ఎలా వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Next Story