Telugu Global
National

ఎగ్జిట్ పోల్స్ పై ఎన్డీటీవీ క్షమాపణ

మొన్న ఢిల్లీ ఎన్నికలు.. ఇప్పుడు బీహార్ ఎన్నికలు. మీడియా విశ్వసనీయతనే ప్రశ్నించేలా చేశాయి. దాదాపు అన్ని జాతీయ ఛానళ్లు కూడా ఊహించని రీతిలో ఫలితాలు వచ్చాయి. అన్ని మీడియా చానళ్లు నితీష్ కూటమి, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో తెలిపాయి. అయితే అందులోనూ నితీష్, లాలూ కూటమికే విజయావకాశాలు ఉన్నాయని ఒకటి రెండు చానల్స్ మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే ఇదంతా జరిగిన ఒక రోజు తర్వాత మరో మీడియా […]

ఎగ్జిట్ పోల్స్ పై ఎన్డీటీవీ క్షమాపణ
X
మొన్న ఢిల్లీ ఎన్నికలు.. ఇప్పుడు బీహార్ ఎన్నికలు. మీడియా విశ్వసనీయతనే ప్రశ్నించేలా చేశాయి. దాదాపు అన్ని జాతీయ ఛానళ్లు కూడా ఊహించని రీతిలో ఫలితాలు వచ్చాయి. అన్ని మీడియా చానళ్లు నితీష్ కూటమి, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేల్లో తెలిపాయి. అయితే అందులోనూ నితీష్, లాలూ కూటమికే విజయావకాశాలు ఉన్నాయని ఒకటి రెండు చానల్స్ మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
అయితే ఇదంతా జరిగిన ఒక రోజు తర్వాత మరో మీడియా సంస్థ ఎన్డీటీవీ తన ఎగ్జిట్‌ పోల్ సర్వేను వెల్లడించింది. అన్ని చానల్స్ కు భిన్నంగా బీహార్‌లో ఎన్డీయే కూటమిదే గెలుపని దాదాపు 150కి పైగా సీట్లు బీజేపీ కూటమికి వస్తాయని ఎన్డీటీవీ లెక్క వేసింది. కానీ ఫలితాలు విడుదలైన తర్వాత ఎన్డీటీవీ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే పూర్తిగా తప్పని తేలిపోయింది.
దీంతో ఎన్డీటీవీ ఇరుకున పడింది. తన విశ్వసనీయతను దెబ్బతీసుకుంది. ఇది గమనించిన ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తిగా తప్పు కావటంపై క్షమాపణలు కోరారు. అయితే మిగతా చానల్స్ లా గొప్పలకు పోకుండా జరిగిన పొరపాటును హుందాగా ఒప్పుకోవటం ద్వారా ఎన్డీటీవీ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంది. సాంకేతికంగా జరిగిన తప్పులతోపాటు తమ అంచనాలు కూడా తప్పయ్యాయని వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హుందాగా వివరణ ఇచ్చింది ఎన్డీటీవీ.
First Published:  10 Nov 2015 12:27 AM GMT
Next Story