బాబుకు కొత్త చిక్కులు
ఎల్ బీనగర్ ఎమ్మెల్యే క్రిష్ణయ్య రూపంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త చిక్కులు వచ్చేలా ఉన్నాయి. ఏపీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు లక్షా40 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. త్వరలోనే ఉద్యమానికి దిగుతానని ఆర్.కృష్ణయ్య చేసిన ప్రకటనే ఇందుకు కారణం. బీసీ సంఘం అధినేతగా పార్టీ అధ్యక్షుడిపై ఉద్యమానికి దిగుతాననడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. బాబు వస్తేనే జాబు అంటూ ఎన్నికల సమయంలో ఏపీలో విపరీతంగా ప్రచారం […]
BY sarvi10 Nov 2015 8:11 AM IST
X
sarvi Updated On: 10 Nov 2015 8:11 AM IST
ఎల్ బీనగర్ ఎమ్మెల్యే క్రిష్ణయ్య రూపంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త చిక్కులు వచ్చేలా ఉన్నాయి. ఏపీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు లక్షా40 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. త్వరలోనే ఉద్యమానికి దిగుతానని ఆర్.కృష్ణయ్య చేసిన ప్రకటనే ఇందుకు కారణం. బీసీ సంఘం అధినేతగా పార్టీ అధ్యక్షుడిపై ఉద్యమానికి దిగుతాననడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. బాబు వస్తేనే జాబు అంటూ ఎన్నికల సమయంలో ఏపీలో విపరీతంగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు గెలిచిన తరువాత ఆ హామీని అటకెక్కించారు. పైగా చాలా శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తోన్న వందలాది మంది ఉద్యోగులను పీకిపారేశారు. ఈ విషయంలో చాలామంది నిరుద్యోగుల్లో అసహనం పెరిగిపోతోంది. దీనికితోడు 2014 డీఎస్సీని నిర్వహించి ఫలితాలు వెల్లడించినా నియామకాల ఊసే ఎత్తడం లేదు. ఏడాదిన్నరగా జాబుల కోసం నోటిఫికేషన్ ఇస్తారని ఎదురుచూశాం. ఇకపై ఊరుకునేది లేదు.. ఆందోళన బాట పడతామని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
మళ్లీ క్రియాశీలకం అవుతున్నారా?
రాష్ట్రం విడిపోయినా బీసీ సంఘం అధినేతగా రెండు రాష్ర్టాల్లో ఆర్.కృష్ణయ్యకు మంచి పేరే ఉంది. తెలంగాణ సీఎం అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలోకి దిగిన ఆర్.కృష్ణయ్యకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాక గానీ వాస్తవం తెలిసిరాలేదు. పార్టీ ఆయనను కనీసం అసెంబ్లీ పక్ష నేతగానైనా నియమించకపోవడంతో క్రిష్ణయ్య అలిగారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మధ్యలో టీఆర్ ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా.. ఆయన ఖండించారు. క్రిష్ణయ్య ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బీసీ సంఘం నేతగా క్రియాశీలకంగా లేరు. తాజా ప్రకటనతో ఆయన తిరిగి బీసీల కోసం ఆందోళన బాట పట్టనున్నారన్న సంకేతాలు ఇచ్చారు. ఆర్.కృష్ణయ్య క్రియాశీలకం అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా.. ఏపీ సీఎం చంద్రబాబుకే చిక్కులు ఎక్కువ. ఎందుకంటే.. ఆయన ఇంతవరకు డీఎస్సీ-2014 తప్ప ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయలేదు. దీనిపై యువత అసహనంగా ఉన్నారు. ఇటీవల కాపులకు బీసీ రిజర్వేషన్లు అంటూ రిజర్వేషన్ల తుట్టెను కదిపారు. దీనిపై బీసీల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వస్తోంది. ఈ అంశానికి వ్యతిరేకంగా ఆర్.కృష్ణయ్య ఉద్యమిస్తే.. మాత్రం చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా ఆత్మరక్షణలో పడతారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
Next Story