Telugu Global
Others

లాలూ ఇంటికే డిప్యూటీ సీఎం పదవి

బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాకూటమి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిసారించింది. మూడోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈనెల 20న ప్రమాణం చేయబోతున్నారు. సీఎం సహా మొత్తం 36 మందితో కేబినెట్ ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గంపై లాలూ ముద్ర ఉండబోతోందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ ను ఎన్నుకునేందుకు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయంగా […]

లాలూ ఇంటికే డిప్యూటీ సీఎం పదవి
X

బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాకూటమి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిసారించింది. మూడోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈనెల 20న ప్రమాణం చేయబోతున్నారు. సీఎం సహా మొత్తం 36 మందితో కేబినెట్ ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గంపై లాలూ ముద్ర ఉండబోతోందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ ను ఎన్నుకునేందుకు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు రాజకీయంగా తన వారసులకు ప్రాధాన్యత ఉండేలా లాలూ పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈసారి ఎన్నికల్లో లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీయాదవ్‌లు మహువా, రాఘోపూర్ అసెంబ్లీ స్థానాల నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. లాలూ కుమార్తె మీసా భారతి మాత్రం గత లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో తన ఇద్దరు కుమారులకు మంత్రి పదవులు తీసుకోవాలా లేక.. ఉప ముఖ్యమంత్రి పదవి కోరాలా అన్నదానిపై లాలూ లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లాలూ సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి మాత్రం ఇప్పటి వరకూ తాము తీసుకున్న పదవులు చాలని కొత్త పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే లాలూ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
అటు సోదరులకు మంత్రిపదవులు వస్తాయా అని మీసా భారతిని అడిగితే ప్రతి ఎంఎల్ఏ మంత్రి కావాలనే కోరుకుంటాడని అందువల్ల తన సోదరులు మంత్రులు కావడంలో తప్పేంలేదని ఆమె చెప్పింది. ఈ పరిస్థితుల్లో లాలూ కుమారుల్లో ఒకరికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండు పెరుగుతోంది. లేదంటే కీలకమైన శాఖలు అప్పగించాలని ఆర్‌జెడి కోరే అవకాశం కనిపిస్తున్నది.

First Published:  10 Nov 2015 6:10 AM IST
Next Story