Telugu Global
Others

మోదీపై అగ్రనేతల తిరుగుబాటు

బిహార్‌లో బీజేపీ ఘోర ఓటమి నేపథ్యంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై అగ్రనేతలు తిరుగుబావుట ఎగరేశారు.   ముసుగులో గుద్దులాటలా కాకుండా బహిరంగంగానే గళమెత్తారు. పార్టీ విధానాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతూ ఏకంగా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.  అగ్రనేతలు ఎల్‌ కే అద్యానీ,  మురళీమనోహర్ జోషి,  శాంతకుమార్, యశ్వంత్ సిన్హాలు ఈ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  బిహార్‌లో ఓటమి ప్రతి ఒక్కరి బాధ్యత అనడం తప్పించుకునే […]

మోదీపై అగ్రనేతల తిరుగుబాటు
X

బిహార్‌లో బీజేపీ ఘోర ఓటమి నేపథ్యంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై అగ్రనేతలు తిరుగుబావుట ఎగరేశారు. ముసుగులో గుద్దులాటలా కాకుండా బహిరంగంగానే గళమెత్తారు. పార్టీ విధానాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతూ ఏకంగా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అగ్రనేతలు ఎల్‌ కే అద్యానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హాలు ఈ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

ప్రకటనలో పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ఓటమి ప్రతి ఒక్కరి బాధ్యత అనడం తప్పించుకునే ప్రయత్నమేనని మండిపడ్డారు. గెలిస్తే క్రెడిట్‌ మొత్తం తీసుకునేందుకు ముందుకొచ్చే వాళ్లు…. ఇప్పుడు బిహార్ ఒటమి బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా మోదీ, అమిత్ షాలపై అగ్రనేతలు దాడి చేశారు.

ఏడాదిగా పార్టీలో నీరసమైన విధానాలు కనిపిస్తున్నాయని దాని ఫలితమే బిహార్ ఓటమని అద్వానీ తదితరులు తమ ప్రకటనలో విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని బిహార్‌ ఫలితాలతో స్పష్టమవుతోందని మండిపడ్డారు. అగ్రనేతలు ఇలా బహిరంగంగా ప్రకటన విడుదల చేయడంతో కమలం పార్టీలో కలకలం రేగింది. పరిస్థితి చాలా దూరం వెళ్లేలా ఉందని ఆందోళన చెందుతున్నారు.

First Published:  10 Nov 2015 4:19 PM IST
Next Story