బీహార్ ఎమ్మెల్యేల్లో 58 శాతం మందిపై క్రిమినల్ కేసులు
బీహార్ ఎన్నికలు అయిన తర్వాత వెల్లడయిన నిజాలు తెలుసుకుంటే జనానికి దిమ్మ తిరిగి పోతుంది. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం, ఎన్నికల నిఘా సంఘంతో కలిసి నిర్వహించిన ఓ సంయుక్త సర్వేలో తాజా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 58 శాతం మంది నేర ప్రవృత్తి కలవారేనని వెల్లడయ్యింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 140 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ చరిత్ర ఉన్నవారేనని వెల్లడయ్యింది. వీరందరిపై క్రిమినల్ కేసులున్నట్టు రికార్డులు తెలుపుతున్నాయి. ఇదే 2010లో జరిగిన ఎన్నికల్లో నేర ప్రవృత్తి […]
బీహార్ ఎన్నికలు అయిన తర్వాత వెల్లడయిన నిజాలు తెలుసుకుంటే జనానికి దిమ్మ తిరిగి పోతుంది. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం, ఎన్నికల నిఘా సంఘంతో కలిసి నిర్వహించిన ఓ సంయుక్త సర్వేలో తాజా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 58 శాతం మంది నేర ప్రవృత్తి కలవారేనని వెల్లడయ్యింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 140 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ చరిత్ర ఉన్నవారేనని వెల్లడయ్యింది. వీరందరిపై క్రిమినల్ కేసులున్నట్టు రికార్డులు తెలుపుతున్నాయి. ఇదే 2010లో జరిగిన ఎన్నికల్లో నేర ప్రవృత్తి ఉన్న వారి శాతం 33 మాత్రమే. ఈసారి ఇది మరో 25 శాతం పెరిగి రికార్డు సృష్టించింది. 140 మందిలో యాభై శాతం మందిపై తీవ్ర అభియోగాలున్నట్టు వెల్లడయ్యింది. వీరందరిపై తీవ్ర నేరారోపణలున్నాయి. హత్య, హత్యాయత్నం, మత కలహాలు, మహిళల కిడ్నాప్, అత్యాచారాలు వంటి నేరాలు వీరిపై తీవ్ర అభియోగాలున్నాయి. ఇంకో విశేషం ఏమిటంటే… ఎన్నికయిన ఎమ్మెల్యేల్లో సగటున నలుగురిలో ఒకరు యాదవ్ కులస్థులు కావడం గమనార్హం.