రజనీకాంత్ కొత్త సినిమా పేరు..
ప్రస్తుతం కబలి పేరుతో తెరకెక్కుతోంది రజనీకాంత్ కొత్త సినిమా. ఈ సినిమా తమిళ టైటిల్ కూడా ఇదే. ఈవిషయాన్ని మేకర్స్ కూడా అధికారికంగా కన్ పర్మ్ చేశారు. తాజాగా కబలి సినిమాకు సంబంధించి తెలుగు టైటిల్ కూడా ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి మహదేవ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మ్యాగ్జిమం అదే పేరును ఖరారుచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వచ్చేనెల 12న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు రజనీకాంత్. ఆ రోజున తమిళ పోస్టర్లతో […]
BY sarvi9 Nov 2015 12:35 AM IST
X
sarvi Updated On: 9 Nov 2015 6:46 AM IST
ప్రస్తుతం కబలి పేరుతో తెరకెక్కుతోంది రజనీకాంత్ కొత్త సినిమా. ఈ సినిమా తమిళ టైటిల్ కూడా ఇదే. ఈవిషయాన్ని మేకర్స్ కూడా అధికారికంగా కన్ పర్మ్ చేశారు. తాజాగా కబలి సినిమాకు సంబంధించి తెలుగు టైటిల్ కూడా ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి మహదేవ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మ్యాగ్జిమం అదే పేరును ఖరారుచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వచ్చేనెల 12న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు రజనీకాంత్. ఆ రోజున తమిళ పోస్టర్లతో పాటు,.. మహదేవ పేరుతో తెలుగు పోస్టర్లు కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేషియాలో శరవేగంగా జరుగుతోంది. బాషా సినిమా తర్వాత రజనీకాంత్ డాన్ గా నటిస్తున్న మూవీ ఇదే కావడంతో, మహదేవ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
Next Story