Telugu Global
Cinema & Entertainment

శ్రీదేవిపై "పులి" నిర్మాతల పత్రికా ప్రకటన

పులి చిత్రానికి గాను శ్రీదేవి రెమ్యునరేషన్ వివాదం ముదిరింది. తనకు ఇవ్వాల్సిన పారితోషకంలో ఇంకా 50 లక్షలు చెల్లించలేదంటూ శ్రీదేవి చేసిన ఫిర్యాదుపై ”పులి” నిర్మాతలు అంతే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. శ్రీదేవి తీరుపై నిప్పులు చెరిగారు. శ్రీదేవి వల్ల తమకు ఒక్క రూపాయి కూడా లాభం జరగలేదని వాపోయారు .  ఒప్పందం ప్రకారం శ్రీదేవికి ఇవ్వాల్సిన రూ.3 కోట్ల పారితోషికం ఎప్పుడో చెల్లించేశామని నిర్మాతలు స్పష్టం చేశారు. అయితే తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్‌కు […]

శ్రీదేవిపై పులి నిర్మాతల పత్రికా ప్రకటన
X

పులి చిత్రానికి గాను శ్రీదేవి రెమ్యునరేషన్ వివాదం ముదిరింది. తనకు ఇవ్వాల్సిన పారితోషకంలో ఇంకా 50 లక్షలు చెల్లించలేదంటూ శ్రీదేవి చేసిన ఫిర్యాదుపై ”పులి” నిర్మాతలు అంతే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. శ్రీదేవి తీరుపై నిప్పులు చెరిగారు. శ్రీదేవి వల్ల తమకు ఒక్క రూపాయి కూడా లాభం జరగలేదని వాపోయారు . ఒప్పందం ప్రకారం శ్రీదేవికి ఇవ్వాల్సిన రూ.3 కోట్ల పారితోషికం ఎప్పుడో చెల్లించేశామని నిర్మాతలు స్పష్టం చేశారు. అయితే తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్‌కు గాను అదనపు పారితోషకం డిమాండ్‌ చేస్తున్నారంటూ ‘పులి’ నిర్మాణ సంస్థ ఎస్‌కేటీ స్టూడియోస్‌ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

పులి సినిమాలో నటించిన విజయ్‌, సుదీప్‌, శ్రుతీహాసన, హన్సిక ఇతర నటీనటులెవ్వరూ ఇలా అదనపు పారితోషకం డిమాండ్‌ చేయలేదని నిర్మాతలు చెబుతున్నారు. నిజానికి శ్రీదేవి వల్లే తాము అధికంగా నష్టపోయామని వాపోయారు. షూటింగ్ మధ్యలో ఉండగా అదనపు సొమ్ము చెల్లిస్తేనే షూటింగ్‌కు వస్తానంటూ శ్రీదేవి బ్లాక్‌మెయిల్ చేసిందని ఆరోపించారు. షూటింగ్‌ ఆగిపోతుందేమోనన్న భయంతో వేరే దారిలేక తెలుగు డబ్బింగ్‌కి రూ.15లక్షలు, హిందీ డబ్బింగ్‌లో శాటిలైట్‌ రైట్స్‌లో 20 శాతం ఇస్తామని అంగీకరించామన్నారు. అప్పుడే ఈ విషయం తెలుసుకున్న నిర్మాతల సంఘం పెద్దలు తమ చర్యను తప్పుబట్టారని, సినిమా వ్యాపారంలో ఈ కొత్త పోకడపై అంసతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.

హిందీలో శ్రీదేవికి భారీ మార్కెట్‌ ఉందంటూ బోనీకపూర్‌ చెప్పడంతో స్థాయికి మించి హిందీలో ప్రమోషన చేశామని, కానీ, ఒక్క రూపాయి కూడా రాలేదని వాపోయారు. సినిమా మొత్తానికి ముగ్గురు కాస్ట్యూమ్‌ డిజైనర్లను పెడితే, శ్రీదేవి ఒక్కరే ప్రత్యేకంగా మనీశ్‌ మల్షోత్రా అనే కాస్ట్యూమ్‌ డిజైనర్ కోసం పట్టుబడ్డారని దాని వల్ల కూడా తమకు నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ఆరోపించింది. తీరా ఇంతచేస్తే తెలుగు, హిందీ ఆడియో ఫంక్షన్లకు కూడా శ్రీదేవి రాలేదని పులి నిర్మాతలు పత్రికా ప్రకటనలో మండిపడ్డారు.

First Published:  9 Nov 2015 5:59 PM IST
Next Story