నాగార్జున చేపల కూరకు సమంత ఫిదా
హిట్సినిమాల హీరోయిన్ సమంత చేపల కూరకు వీరాభిమాని అయింది. అదేంటి? హీరోయిన్లు డైట్ పాటిస్తారు కదా! చేపల కూర ఎందుకు తింటారు? అనే కదా మీ ప్రశ్న. అయితే సమంత మాత్రం చేపల కూర విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చేసింది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సమంతకు హీరో నాగార్జన తమ రెస్టారెంట్ నుంచి ఓ స్పెషల్ చేపల కూరను పంపించాడు. అది తిన్న సమంత అప్పటి నుంచి నాకు ఆ కూరే కావాలని […]
BY sarvi9 Nov 2015 12:34 AM IST
X
sarvi Updated On: 9 Nov 2015 6:22 AM IST
హిట్సినిమాల హీరోయిన్ సమంత చేపల కూరకు వీరాభిమాని అయింది. అదేంటి? హీరోయిన్లు డైట్ పాటిస్తారు కదా! చేపల కూర ఎందుకు తింటారు? అనే కదా మీ ప్రశ్న. అయితే సమంత మాత్రం చేపల కూర విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చేసింది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సమంతకు హీరో నాగార్జన తమ రెస్టారెంట్ నుంచి ఓ స్పెషల్ చేపల కూరను పంపించాడు. అది తిన్న సమంత అప్పటి నుంచి నాకు ఆ కూరే కావాలని మారాం చేస్తోంది. హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చినా.. నాగార్జున రెస్టారెంట్ చేపల కూర లేందే ముద్ద దిగడం లేదట సమంతకి. డైట్ లేదూ పాడూ లేదు. ముందు చేపల కూర రావాల్సిందే! అని పట్టుబట్టి మరీ తెప్పించుకుంటోంది. దీంతో నిర్మాతలు నాగార్జున రెస్టారెంట్ నుంచి ఆ చేపల కూరను తెప్పిస్తున్నారంట.
ధర ఎంతో తెలుసా?
ఇంతకీ అంత రుచికరమైన చేపల పులుసు ధర ఎంతో తెలుసా? అక్షరాలా నాలుగువేల రూపాయలు. అమ్మో! అంత ధరే! ఇంతకీ ఏముంది అందులో అంత స్పెషాలిటీ అని తీసిపారేయకండి. ఆ చేపలు ఇండియావి కావు. విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారంట. వీటిని ఇంటర్నేషనల్ చెఫ్‌లు వండి, వడ్డిస్తారన్నమాట. అందుకే ఈ కూరకి అంత డిమాండ్. సినిమా హీరోయిన్ ఆర్డర్ చేశాక నిర్మాత తెప్పించననడం బాగోదు కదా! అందుకే ధర ఎక్కువైనా సరే.. అదే రెస్టారెంట్ నుంచి తెప్పిస్తున్నారంట. డైట్‌ను పక్కన బెట్టి మరీ సమంత చేపల కూర లాగించేయడం చూస్తుంటే.. జిహ్వా రుచి ఎంత గొప్పదో కదా అని లొట్లలేస్తున్నారంట.. సినీ జనాలు.
Next Story