బస్సులు, బ్యాంకులు తగలబెట్టించింది బాబే!
కాపు నాయకుడు వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తముందంటూ ఇటీవల సీనియర్ నేత హరిరామజోగయ్య పుస్తకంలో రాసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మరో కాపు నేత ముద్రగడ పద్మనాభం… చంద్రబాబుపై మరో తీవ్ర ఆరోపణ చేశారు. 1984లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించినప్పుడు రాష్ట్రంలో బస్సులు, రైళ్లు, బ్యాంకులు, ఇతర కార్యాలయాలను తగలబెట్టించింది చంద్రబాబేనని ఆరోపించారు. రామకృష్ణ స్డూడియోలో కూర్చుని బస్సులు, రైళ్లు, బ్యాంకులు తగలబెట్టేలా రెచ్చగొట్టారని చెప్పారు. చంద్రబాబుకు సీఎం కుర్చి దక్కడానికి కాపులే కారణమని […]

కాపు నాయకుడు వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తముందంటూ ఇటీవల సీనియర్ నేత హరిరామజోగయ్య పుస్తకంలో రాసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మరో కాపు నేత ముద్రగడ పద్మనాభం… చంద్రబాబుపై మరో తీవ్ర ఆరోపణ చేశారు. 1984లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించినప్పుడు రాష్ట్రంలో బస్సులు, రైళ్లు, బ్యాంకులు, ఇతర కార్యాలయాలను తగలబెట్టించింది చంద్రబాబేనని ఆరోపించారు. రామకృష్ణ స్డూడియోలో కూర్చుని బస్సులు, రైళ్లు, బ్యాంకులు తగలబెట్టేలా రెచ్చగొట్టారని చెప్పారు. చంద్రబాబుకు సీఎం కుర్చి దక్కడానికి కాపులే కారణమని అలాంటివారిని విస్మరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వచ్చే జనవరి 31న తూర్పుగోదావరి జిల్లాలో కాపు కులాల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ముద్రగడ ప్రకటించారు.