మహేష్ కోరిక తీరలేదు...
బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించి ఓ అరుదైన రికార్డు సృష్టించాలనుకున్నాడు మహేష్ బాబు. జుమ్మూ-కాశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించాలనుకున్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ తెలుగు సినిమాను జమ్మూ-కాశ్మీర్ లో తీశారనే ఘనతను సొంతం చేసుకోవాలనుకున్నాడు. కాశ్మీర్ అందాల్ని మరోసారి వెండితెరపై చూపించాలనుకున్నాడు. కానీ మహేష్ ఆశలపై జేకే గవర్న్ మెంట్ నీళ్లు చల్లింది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని షూటింగ్ జరపడానికి అనుమతి నిరాకరించింది. ప్రస్తుతం బోర్డర్ లో ఉగ్రవాదులు, వేర్పాటువాదులు […]
BY sarvi9 Nov 2015 4:13 AM IST

X
sarvi Updated On: 9 Nov 2015 4:15 AM IST
బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించి ఓ అరుదైన రికార్డు సృష్టించాలనుకున్నాడు మహేష్ బాబు. జుమ్మూ-కాశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించాలనుకున్నారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ తెలుగు సినిమాను జమ్మూ-కాశ్మీర్ లో తీశారనే ఘనతను సొంతం చేసుకోవాలనుకున్నాడు. కాశ్మీర్ అందాల్ని మరోసారి వెండితెరపై చూపించాలనుకున్నాడు. కానీ మహేష్ ఆశలపై జేకే గవర్న్ మెంట్ నీళ్లు చల్లింది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని షూటింగ్ జరపడానికి అనుమతి నిరాకరించింది. ప్రస్తుతం బోర్డర్ లో ఉగ్రవాదులు, వేర్పాటువాదులు ఎప్పటికప్పుడు దాడులకు తెగబడుతున్నారని, వాణిజ్య ప్రకటనలతో జాతీయస్థాయిలో పాపులర్ అయిన మహేష్ ను కచ్చితంగా టార్గెట్ చేస్తారని చెబుతున్నారు. దీంతో బ్రహ్మోత్సవం షెడ్యూల్ ను కాశ్మీర్ నుంచి ఊటీకి మార్చేశారు. అలా కాశ్మీర్ లో షూటింగ్ చేయాలనే కోరికను నెరవేర్చుకోలేకపోయాడు మహేష్.
Next Story