ఎవరితోనైనా పెట్టుకోండి... నాతో కాదు
రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కొందరు కావాలనే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తాను కూడా రాయలసీమ వాడినేనని గుర్తు చేశారు. కంఠంలో ప్రాణముండగా సీమను అన్యాయం చేయనన్నారు. కర్నూలుకు రాజధాని వైభవం తెస్తామన్నారు.అవసరమైతే కర్నూలులోనే బస్సులో తిష్టవేసి అభివృద్ధి చేస్తానని చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటలో భాగంగా ఓర్వకల్లుకు వచ్చిన ఆయన… స్థానిక నేతల వల్లే సీమ […]
రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కొందరు కావాలనే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తాను కూడా రాయలసీమ వాడినేనని గుర్తు చేశారు. కంఠంలో ప్రాణముండగా సీమను అన్యాయం చేయనన్నారు. కర్నూలుకు రాజధాని వైభవం తెస్తామన్నారు.అవసరమైతే కర్నూలులోనే బస్సులో తిష్టవేసి అభివృద్ధి చేస్తానని చెప్పారు.
కర్నూలు జిల్లా పర్యటలో భాగంగా ఓర్వకల్లుకు వచ్చిన ఆయన… స్థానిక నేతల వల్లే సీమ వెనుకబడిందని విమర్శించారు. కొందరు నేతలు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పారు. ఎవరితోనైనా పెట్టుకోవాలని… తనతో మాత్రం పెట్టుకోవద్దని హెచ్చరించారు. రాయలసీమకు ఎక్కడ అన్యాయం జరిగిందో తెలపాన్నారు.