బాలకృష్ణపై కాలుదువ్వబోతున్న నాగ్
గత రెండు సంవత్సరాలుగా బాలయ్య మరియు నాగర్జున అసలు మొహమొహాలు చూసుకోవడమే మానేసారు. ఎక్కడైనా ఒకే ఫంక్షన్ కి హాజరైనా, ఒకరినొకరు అవాయిడ్ చేయడం కనిపిస్తున్నది. నాగార్జున స్వయంగా బాలకృష్ణ ఇంటికి వెళ్ళి మరీ రాజీకి ప్రయత్నించినా, బాలయ్య ఇంట్లోనే ఉండి లేడనిపించాడని ఇండస్ట్రీ వర్గాల కథనం. ఆ గ్యాప్ అలాగే ఉంది. ఇక ఆ గ్యాప్ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదెలా? .. రాబోయే సంక్రాంతి బరిలోకి బాలయ్య ‘డిక్టేటర్’ ముందే కండువా వేసేసింది. […]
గత రెండు సంవత్సరాలుగా బాలయ్య మరియు నాగర్జున అసలు మొహమొహాలు చూసుకోవడమే మానేసారు. ఎక్కడైనా ఒకే ఫంక్షన్ కి హాజరైనా, ఒకరినొకరు అవాయిడ్ చేయడం కనిపిస్తున్నది. నాగార్జున స్వయంగా బాలకృష్ణ ఇంటికి వెళ్ళి మరీ రాజీకి ప్రయత్నించినా, బాలయ్య ఇంట్లోనే ఉండి లేడనిపించాడని ఇండస్ట్రీ వర్గాల కథనం. ఆ గ్యాప్ అలాగే ఉంది. ఇక ఆ గ్యాప్ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదెలా? .. రాబోయే సంక్రాంతి బరిలోకి బాలయ్య ‘డిక్టేటర్’ ముందే కండువా వేసేసింది. బాబాయ్ కోసం జూనియర్ ఎన్.టి.ఆర్. తన రాబోయే సినిమా ‘నాన్నకు ప్రేమతో’ను సంక్రాంతి బరి నుండి తప్పించాడు. కాని నాగార్జున మాత్రం తన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాని సంక్రాంతి కానుకగా అందించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడని కథనాలు వెలువడుతున్నాయి. ఇద్దరి మధ్య ఈ కాంపిటీషన్ .. వారి మధ్య ఇంకా దూరం పెంచుతుందని సినీ పరీశీలకుల ఉవాచ. మరి మీరు ఏమంటారు?