Telugu Global
Editor's Choice

నాడు మోడీని గెలిపించాడు " నేడు ఓడించాడు

ఆయన అందరిలా ప్రజల్లో కనిపించడు. నాయకుల్లా ఉపన్యాసాలు దంచడు. కేవలం తన మేధస్సుతో ప్రజల ఆకాంక్షలను పసిగట్టి ముందుకు సాగుతాడు. ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఐఐటి, ఎంబిఏ గ్రాడ్యుయేట్లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి రాజకీయ నేతల తలరాతలు మారుస్తున్నాడు. అందుకే ఆయన ఎక్కడుంటే గెలుపు అక్కడే. అతనే ప్రశాంత్ కిషోర్.  ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. అవును మీకు తెలిసింది నిజమే. ప్రశాంత్ కిషోర్ ఇదివరకు మోడీ వెంట ఉండేవారు. 2014 […]

నాడు మోడీని గెలిపించాడు  నేడు ఓడించాడు
X
ఆయన అందరిలా ప్రజల్లో కనిపించడు. నాయకుల్లా ఉపన్యాసాలు దంచడు. కేవలం తన మేధస్సుతో ప్రజల ఆకాంక్షలను పసిగట్టి ముందుకు సాగుతాడు. ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఐఐటి, ఎంబిఏ గ్రాడ్యుయేట్లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి రాజకీయ నేతల తలరాతలు మారుస్తున్నాడు. అందుకే ఆయన ఎక్కడుంటే గెలుపు అక్కడే. అతనే ప్రశాంత్ కిషోర్.
ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. అవును మీకు తెలిసింది నిజమే. ప్రశాంత్ కిషోర్ ఇదివరకు మోడీ వెంట ఉండేవారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడీని విజయపథంలో నడిపించడంలో ప్రశాంత్ కిషోర్ దే కీలకమైన పాత్ర. లోక్ సభ ఎన్నికల్లో మోడీ సోషల్ మీడియాను, సాంకేతిన విజ్ఞానాన్ని ఎలా వినియోగించున్నారో మనందరికీ తెలుసు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ వెనుక ఉండి నడిపించాడు. లోక్ సభ ఎన్నికల్లో చాయ్ పే చర్చ, సిటిజన్ ఫర్ అకౌంటబుల్ అంటూ కొత్త కొత్త ఆలోచనలకు తెరతీసిన ఈ యువకిశోరం మోడీకి, ఆయన పార్టీకి ఘన విజయం సాధించి పెట్టాడు.
మోడీ విజయం వెనుక ఉన్నది ఎవరని ఆరా తీసిన నితీష్ కుమార్.. ప్రశాంత్ కిషోర్ టాలెంట్ ను గుర్తించి చేరదీశాడు. నితీష్ కు మద్దతుగా బీహార్‌లో ప్రచార బాధ్యతలను తీసుకున్న ప్రశాంత్ కిశోర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీమార్ రాష్ట్రం అంటూ విమర్శించే బీహార్ లోనూ సాంకేతిక పరిజ్ఞానంతో కనెక్ట్‌ టు నితీశ్ పేరుతో ఆన్‌లైన్ జనతా దర్బార్ నిర్వహించాడు. యువ ఓటర్లకు నితీష్ ను దగ్గర చేయడంలో విజయం సాధించాడు. ముఖ్యంగా మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకునే యువకులనే టార్గెట్ గా చేసుకున్నాడు. ఘర్‌ ఘర్‌ తక్ దస్తక్ అంటూ బీహార్ లో నితీశ్ అమలు చేసిన పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రశాంత్ ప్రచార కార్యక్రమం నిర్వహించాడు. ఫలితంగా బీహార్‌లో నితీశ్ , లాలూ నేతృత్వంలోని మహాకూటమి ఊహించని విజయం సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడీని విజయపథంలో నడిపించిన ప్రశాంత్ కిషోర్ ఈసారి నితీష్ వైపు చేరి అదే మోడీని కూడా ఓడించడంలో భాగస్వామ్యం పంచుకున్నాడు.
First Published:  8 Nov 2015 12:38 PM IST
Next Story