Telugu Global
National

బీహార్ లో ని'తీన్'మార్

బీహార్ లో మూడు రోజుల ముందే దీపావళి వచ్చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన బీహార్ ఎన్నికల్లో నితీష్, లాలూ కూటమి ఏకపక్షంగా ఘన విజయం సాధించింది. జేడీయూ బాణంలా దూసుకుపోయింది. ఇంతకాలం బీజేపీ నేతలంతా చెప్పుకునే ధ్వయం మోడీ-అమిత్ షాలకు లాలు-నితీష్ షాకిచ్చారు. బీహారీలు బయటివారిని నమ్మరని ప్రజలు ప్రధాని మోడీకి ధీటైన సమాధానం ఇచ్చారు. ప్యాకేజీల పేరుతో ఓట్లు కొల్లగొట్టాలన్న మోడీ వ్యూహానికి కూడా నితీష్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. మొత్తంగా బిమారూ రాష్ట్రంగా చెప్పుకునే […]

బీహార్ లో నితీన్మార్
X
బీహార్ లో మూడు రోజుల ముందే దీపావళి వచ్చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన బీహార్ ఎన్నికల్లో నితీష్, లాలూ కూటమి ఏకపక్షంగా ఘన విజయం సాధించింది. జేడీయూ బాణంలా దూసుకుపోయింది. ఇంతకాలం బీజేపీ నేతలంతా చెప్పుకునే ధ్వయం మోడీ-అమిత్ షాలకు లాలు-నితీష్ షాకిచ్చారు. బీహారీలు బయటివారిని నమ్మరని ప్రజలు ప్రధాని మోడీకి ధీటైన సమాధానం ఇచ్చారు. ప్యాకేజీల పేరుతో ఓట్లు కొల్లగొట్టాలన్న మోడీ వ్యూహానికి కూడా నితీష్ తనదైన శైలిలో జవాబిచ్చాడు.
మొత్తంగా బిమారూ రాష్ట్రంగా చెప్పుకునే బీహార్ లో ఈనెల 24న మూడోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పగ్గాలు చేపట్టబోతున్నారు. మొదటి నుంచి దేశ వ్యాప్తంగా మోడీ హవా కొనసాగిన సమయంలోనూ నితీష్ మాత్రం అదరలేదు. బెదరలేదు. తన ప్రజలకు గతంలో ఎన్నడూ లేనంత సుపరిపాలనను అందిస్తూ ముందుకు సాగాడు. అయితే 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి కేవలం 2 సీట్లే రావడంతో బాధ్యత వహించి సీఎం పదవి నుంచి తప్పుకుని హుందాగా వ్యవహరించాడు. తర్వాతి కాలంలో మాంజీని దింపేసి తానే సీఎం అయ్యారు. బీజేపీ ఎత్తుగడలకు బెదరకుండా పై ఎత్తు వేశారు.
గెలుపుపై నమ్మకం ఉన్నా.. శత్రువు బలమైన వాడన్న విషయాన్ని గ్రహించిన నితీష్ తన చిరకాల శత్రువైన లాలూతోనూ చేతులు కలిపాడు. కేసుల్లో చిక్కుని శిక్ష పడిన లాలుతో జతకడితే నితీష్ కే నష్టం మని దేశమంతా కోడై కూసినా నితీష్ మాత్రం లాలూని నమ్మాడు. ఊహించినట్టు ఇద్దరి కలయిక బంపర్ విక్టరీ కొట్టింది. నితీష్ బాణం మాత్రం గురి తప్పలేదు. ముచ్చటగా మూడోసారి బీహార్ సీఎం కాబోతున్నాడు. ఇక్కడే నితీష్ కు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. గతంలోలా ఈసారి నితీష్ స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉండదు. ఇప్పటికే లాలూ కుటుంబ సభ్యులంతా ఎమ్మెల్యేలు అయ్యారు. దీంతో వారికి మంత్రి పదవులు వచ్చే చాన్స్ ఉంది. మరి నితీష్ లాలూకి లొంగుతారా? లేక ఇదివరకటి లాగా వికాష్ పురుష్ అన్న పేరును నిలుపుకుంటారా? అన్నది చూడాలి.
First Published:  8 Nov 2015 4:58 PM IST
Next Story