Telugu Global
Cinema & Entertainment

పోస్టర్లతో సమాధానమిచ్చాడు

దర్శకుడు పూరి జగన్నాధ్, పోస్టర్లతో సమాధానమిచ్చాడు. తమ కొత్త సినిమాపై ఈమధ్య కాలంలో వచ్చిన ఊహాగానాలకు ఫస్ట్ లుక్ తోనే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం వరుణ్ తేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్. ఈ సినిమాకు లోఫర్ అనే టైటిల్ పెట్టారు. అయితే ఆ టైటిల్ ను మార్చే ఆలోచన ఉందని హీరో, దర్శకుడు ఇద్దరూ ప్రకటించారు. అన్నట్టుగానే టైటిల్ మార్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే చర్చల్లో పూరి జగన్నాధే విజయం సాధించాడు. ఎంతో […]

పోస్టర్లతో సమాధానమిచ్చాడు
X
దర్శకుడు పూరి జగన్నాధ్, పోస్టర్లతో సమాధానమిచ్చాడు. తమ కొత్త సినిమాపై ఈమధ్య కాలంలో వచ్చిన ఊహాగానాలకు ఫస్ట్ లుక్ తోనే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం వరుణ్ తేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్. ఈ సినిమాకు లోఫర్ అనే టైటిల్ పెట్టారు. అయితే ఆ టైటిల్ ను మార్చే ఆలోచన ఉందని హీరో, దర్శకుడు ఇద్దరూ ప్రకటించారు. అన్నట్టుగానే టైటిల్ మార్పుపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే చర్చల్లో పూరి జగన్నాధే విజయం సాధించాడు. ఎంతో ఇష్టపడి పెట్టుకున్న ఆ టైటిల్ ను మార్చకుండా ఉంటేనే బెటరని అందర్నీ ఒప్పించాడు. టైటిల్ లో నెగెటివిటీ ఉంటే సినిమా హిట్ అంటూ పోకిరి, ఇడియట్ సెంటిమెంట్ తీసుకొచ్చాడు. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు. పూరి గెలిచాడు. గెలిచిన ఆనందంలో లోఫర్ టైటిల్ తో తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేశాడు. అలా లోఫర్ సినిమాపై వచ్చిన అనుమానాలకు పోస్టర్లతోనే సమాధానమిచ్చాడు పూరి జగన్.
First Published:  8 Nov 2015 12:36 AM IST
Next Story