Telugu Global
Cinema & Entertainment

బాహుబలి, శ్రీమంతుడికి జ్యూరీలో ఎదురుదెబ్బ

దేశమే గర్వించదగ్గ సినిమాగా భావించిన బాహుబలి చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2015లో ఊహించని షాక్ తగిలింది. 46వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ప్రదర్శనకు  ఈ చిత్రం  అర్హత సాధించలేకపోయింది. మహేష్ శ్రీమంతుడుకి కూడా అదే చేధు అనుభవం ఎదురైంది. ఇవే కాదు మరే తెలుగు సినిమా కూడా ఆ స్థాయిని చేరలేకపోయాయి. ఈనెల 20 నుంచి 30 తేదీ వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో ఇండియా పనోరమ […]

బాహుబలి, శ్రీమంతుడికి జ్యూరీలో ఎదురుదెబ్బ
X

దేశమే గర్వించదగ్గ సినిమాగా భావించిన బాహుబలి చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2015లో ఊహించని షాక్ తగిలింది. 46వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ప్రదర్శనకు ఈ చిత్రం అర్హత సాధించలేకపోయింది. మహేష్ శ్రీమంతుడుకి కూడా అదే చేధు అనుభవం ఎదురైంది. ఇవే కాదు మరే తెలుగు సినిమా కూడా ఆ స్థాయిని చేరలేకపోయాయి.
ఈనెల 20 నుంచి 30 తేదీ వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో ఇండియా పనోరమ కేటగిరిలో 26 చిత్రాలను ప్రదర్శిస్తారు. బెంగాలీ నుంచి ఏడు చిత్రాలు, హింది నుంచి ఐదు, మలయాళం నుంచి నాలుగు చిత్రాలు ప్రదర్శనకు అర్హత పొందాయి.
బాహుబలి, శ్రీమంతుడితో పాటు మరో మూడు తెలుగు చిత్రాలకు IFFI కోసం పంపగా అన్ని చిత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. బాహుబలిని చూసి టాలీవుడ్డే కాదు దేశమే గర్వించాలని అందరూ చెబుతూ వచ్చారు. కానీ చివరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కాకపోవడం పెద్ద షాకే. టాలీవుడ్ బాక్స్‌ ఆఫీస్‌ను షేక్ చేసిన మహేష్ శ్రీమంతుడికి అదే అనుభవం ఎదురైంది. ఇప్పుడే కాదు గతేడాది కూడా IFFIలో ప్రదర్శనకు ఒక్క తెలుగు సినిమా కూడా అర్హత సాధించలేకపోయింది.

First Published:  8 Nov 2015 12:50 AM IST
Next Story