కిల్లర్ కండోమ్ వస్తోంది..!
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎయిడ్స్ వైరస్‌ను చంపగల కండోమ్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. త్వరలోనే అది మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్టార్ ఫార్మా కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. దీనికి వైవాజెల్ కండోమ్‌గా నామకరణం చేశారు. ఈ నిరోధ్‌కు ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కూడా లభించిందని,త్వరలోనే ఈ కండోమ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. ఆస్టోడ్రైమర్ సోడియమ్ అనే రసాయనంతో […]
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎయిడ్స్ వైరస్‌ను చంపగల కండోమ్‌ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. త్వరలోనే అది మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్టార్ ఫార్మా కంపెనీ దీన్ని తయారు చేస్తోంది. దీనికి వైవాజెల్ కండోమ్‌గా నామకరణం చేశారు. ఈ నిరోధ్‌కు ఆస్ట్రేలియా థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కూడా లభించిందని,త్వరలోనే ఈ కండోమ్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది.
ఆస్టోడ్రైమర్ సోడియమ్ అనే రసాయనంతో తయారు చేసిన జెల్‌ను వైవాజెల్ నిరోధ్ తయారీలో ఉపయోగిస్తారు. ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ జెల్ హెచ్‌ఐవీ వైరస్‌లను 99.9 శాతం కచ్చితత్వంతో చంపేసిందని తేల్చారు. హెచ్‌ఐవీని చంపే కండోమ్ తయారీ ప్రపంచంలో ఇదే తొలిసారని, దీనిని ఉపయోగిస్తే హెచ్‌ఐవీ, సుఖవ్యాధుల నుంచి వంద శాతం రక్షణ లభించినట్లేనని కంపెనీ ధీమాగా చెబుతోంది.