Telugu Global
Cinema & Entertainment

నాన్న‌కు ప్రేమ‌తో విడుద‌ల‌పై పుకార్లు

సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా నాన్న‌కు ప్రేమ‌తో! ఈ సినిమా విడుద‌ల తేదీ జ‌న‌వ‌రి 8 అని నిర్మాత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే, సినిమా విడుద‌ల తేదీ మారిందంటూ ఫిలింన‌గ‌ర్‌లో ఓ టాక్ బ‌య‌ల్దేరింది. ఈ వార్త‌ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. షూటింగ్ షెడ్యూలులో జ‌రిగిన మార్పుల కార‌ణంగా సినిమా సంక్రాంతికి వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌న్న‌ది ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్త‌ల‌ను నిర్మాత‌లు ఖండించారు. షూటింగులో ఎలాంటి […]

నాన్న‌కు ప్రేమ‌తో విడుద‌ల‌పై పుకార్లు
X
సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా నాన్న‌కు ప్రేమ‌తో! ఈ సినిమా విడుద‌ల తేదీ జ‌న‌వ‌రి 8 అని నిర్మాత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే, సినిమా విడుద‌ల తేదీ మారిందంటూ ఫిలింన‌గ‌ర్‌లో ఓ టాక్ బ‌య‌ల్దేరింది. ఈ వార్త‌ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. షూటింగ్ షెడ్యూలులో జ‌రిగిన మార్పుల కార‌ణంగా సినిమా సంక్రాంతికి వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌న్న‌ది ఆ వార్త సారాంశం. అయితే ఈ వార్త‌ల‌ను నిర్మాత‌లు ఖండించారు. షూటింగులో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌లేద‌ని, అనుకున్న‌ట్లుగా జ‌న‌వ‌రి 8 తేదీనే ఎన్టీఆర్ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో జూనియ‌ర్ అభిమానుల్లో సినిమాపై నెల‌కొన్న సందిగ్ధం వీడిపోయింది.
ట్ర‌యిల‌ర్‌ను వీక్షించిన 4 మిలియ‌న్ల మంది!
నాన్న‌కు ప్రేమ‌తో! ట్ర‌యిల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను రోజురోజుకూ పెంచుతోంది. ఇప్ప‌టిదాకా ఈ ట్ర‌యిల‌ర్‌ను దాదాపు 40 ల‌క్ష‌ల మంది వీక్షించారంటే.. చిత్రం కోసం ఎంత‌మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో అర్థ‌మ‌వుతోంది. ఇది ఇండ‌స్ర్టీలో స‌రికొత్త రికార్డు. జ‌న‌వ‌రి 8లోగా ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఈ సినిమా కోసం గెట‌ప్‌పూర్తిగా మార్చాడు జూనియ‌ర్‌. కాస్టూమ్స్‌, డాన్స్‌ల్లోనూ ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నాడు. సినిమాలో మ‌రో హీరో జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తుండ‌టం మ‌రో సెంటిమెంట్‌గా మారింది. కొంత‌కాలంగా జ‌గ‌ప‌తిబాబు నటిస్తున్న‌ సినిమాల‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లుగా నిలుస్తున్న విష‌యం తెలిసిందే. జూనియ‌ర్‌, జ‌గ‌ప‌తి బాబుల న‌ట‌న సినిమాకు హైలైట్ అని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. సినిమాలో జ‌గ‌ప‌తి బాబు హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌కు తండ్రిగా క‌నిపించ‌నున్నారు.
First Published:  7 Nov 2015 12:32 AM IST
Next Story