కుర్రహీరోను తాటిచెట్టు ఎక్కించిన వర్మ
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవర్ని, ఎలా టార్గెట్ చేస్తాడో చెప్పలేం. ఎవర్ని తిడతాడో.. ఎవర్ని పొగుడుతాడో అస్సలు చెప్పలేని పరిస్థితి. అయితే అతడు తిట్టినా, పొగిడినా దాని వెనక వేరే అర్థం ఉంటుందనేది మాత్రం అందరికీ తెలిసినే విషయమే. ఈసారి వర్మ కన్ను యంగ్ హీరో రాజ్ తరుణ్ పై పడింది. ఓ పెగ్ ఫిక్స్ అవ్వగానే, మొబైల్ అందుకున్నాడు. ట్విట్టర్ లో రాజ్ తరుణ్ పై ఎడాపెడా రాసిపడేశాడు. అయితే కుర్రాడ్ని తిట్టలేదు కదా […]
BY sarvi7 Nov 2015 12:34 AM IST

X
sarvi Updated On: 7 Nov 2015 4:26 AM IST
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవర్ని, ఎలా టార్గెట్ చేస్తాడో చెప్పలేం. ఎవర్ని తిడతాడో.. ఎవర్ని పొగుడుతాడో అస్సలు చెప్పలేని పరిస్థితి. అయితే అతడు తిట్టినా, పొగిడినా దాని వెనక వేరే అర్థం ఉంటుందనేది మాత్రం అందరికీ తెలిసినే విషయమే. ఈసారి వర్మ కన్ను యంగ్ హీరో రాజ్ తరుణ్ పై పడింది. ఓ పెగ్ ఫిక్స్ అవ్వగానే, మొబైల్ అందుకున్నాడు. ట్విట్టర్ లో రాజ్ తరుణ్ పై ఎడాపెడా రాసిపడేశాడు. అయితే కుర్రాడ్ని తిట్టలేదు కదా పైపెచ్చు మునగచెట్టు ఎక్కించాడు. రాజ్ తరుణ్ అంతటోటు లేడు అన్నట్టు రాసిపడేశాడు. నిజానికి రాజ్ తరుణ్ యాక్టింగ్ ముందు మిగతా హీరోలంతా సుబ్బారావ్ లే అని ట్వీట్ చేశాడు. అసలు రాజ్ తరుణ్ దగ్గర నటనకు మించిన విషయం ఉందని తేల్చేశాడు మన వర్మ. పూరి, వినాయక్, రాజమౌళిని మించిన దర్శకత్వ ప్రతిభ రాజ్ తరుణ్ వద్ద ఉందని స్టేట్ మెంట్లు గుప్పించాడు. ఒక్కసారిగా వర్మకు రాజ్ తరుణ్ పై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అని అంతా ఆరాతీశారు. ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది. త్వరలోనే రాజ్ తరుణ్ తో వర్మ ఓ సినిమా చేయబోతున్నాడట.

Next Story