గాంధీ బారిస్టర్ పట్టా తిరిగిచ్చారా ఏంటి?
దేశంలో మత అసహనంపై పలువురు అవార్డులను వెనక్కు ఇస్తున్న వేళ ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. జాతీయ అవార్డు వెనక్కు ఇవ్వాలంటూ పలువురు తనపై ఒత్తిడి తెస్తున్నారని కమల్ చెప్పారు. అయితే అవార్డు ఎందుకు వెనక్కు ఇవ్వాలంటూ ఘాటుగా స్పందించారు కమల్. జ్యూరీలు ఇచ్చిన అవార్డులను ప్రభుత్వంపై కోపంతో వెనక్కు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అవార్డును వెనక్కు ఇవ్వాలంటున్న వారికి కమల్ మరో ప్రశ్న వేశారు. బ్రిటిష్ వాళ్ల మీద పోరాడే […]

దేశంలో మత అసహనంపై పలువురు అవార్డులను వెనక్కు ఇస్తున్న వేళ ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. జాతీయ అవార్డు వెనక్కు ఇవ్వాలంటూ పలువురు తనపై ఒత్తిడి తెస్తున్నారని కమల్ చెప్పారు. అయితే అవార్డు ఎందుకు వెనక్కు ఇవ్వాలంటూ ఘాటుగా స్పందించారు కమల్.
జ్యూరీలు ఇచ్చిన అవార్డులను ప్రభుత్వంపై కోపంతో వెనక్కు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అవార్డును వెనక్కు ఇవ్వాలంటున్న వారికి కమల్ మరో ప్రశ్న వేశారు. బ్రిటిష్ వాళ్ల మీద పోరాడే సమయంలో గాంధీజీ తన బారిస్టర్ పట్టాను తిరిగిచ్చారా అని సూటిగా అడిగారు. మనుషుల మీద లేని ప్రేమను జంతువుల మీద చూపడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండని కమల్ చెప్పారు.