చిరు కొడుకునంటూ చెప్పిన దిమ్మ తిరిగే స్టోరి ఇదే!
చిరంజీవికి తాను పెద్దకొడుకునంటూ కావాలంటే డీఎన్‌ఏ పరీక్షలు జరిపించి న్యాయం చేయాలంటూ సుజిత్ అలియాస్ రవీంద్ర అనే వ్యక్తి హెచ్‌ఆర్సీని ఆశ్రయించడం కలకలం రేపింది. అయితే అతడుచెప్పే విషయాల్లో ఎక్కడా పొంతన లేకపోవడంలో అడ్డంగా బుక్కయ్యాడు. అసలు సుజిత్ చెప్పిన కథ వింటే నవ్వులో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి. పవన్ కల్యాణ్ తనను ఎత్తుకుని ముద్దాడేవారని చెప్పుకొచ్చాడు. అంతే కాదు అల్లు అరవింద్ తనను ఎలా చూసుకున్నాడో కూడా సెలవిచ్చాడు. అతడు మీడియాతో ఏం […]
చిరంజీవికి తాను పెద్దకొడుకునంటూ కావాలంటే డీఎన్‌ఏ పరీక్షలు జరిపించి న్యాయం చేయాలంటూ సుజిత్ అలియాస్ రవీంద్ర అనే వ్యక్తి హెచ్‌ఆర్సీని ఆశ్రయించడం కలకలం రేపింది. అయితే అతడుచెప్పే విషయాల్లో ఎక్కడా పొంతన లేకపోవడంలో అడ్డంగా బుక్కయ్యాడు. అసలు సుజిత్ చెప్పిన కథ వింటే నవ్వులో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి. పవన్ కల్యాణ్ తనను ఎత్తుకుని ముద్దాడేవారని చెప్పుకొచ్చాడు. అంతే కాదు అల్లు అరవింద్ తనను ఎలా చూసుకున్నాడో కూడా సెలవిచ్చాడు. అతడు మీడియాతో ఏం చెప్పాడంటే..
” నేను చిరంజీవి కొడుకుగా శాస్త్రీయ ఆధారం కావాలని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాను. అయితే రెగ్యులర్ కోర్టుకు వెళ్లమని చెప్పారు. నేను చిరంజీవి ఇంటిలోనే పుట్టాను. ఏడాది పాటు వాళ్లతోనే ఉన్నాను. ఈ విషయాలన్నీ పసివాడి ప్రాణం సినిమా చూశాక గుర్తుకొచ్చాయి. నేను చిరంజీవి కొడుకునే. చిరంజీవి, సురేఖ గారికి పుట్టిన కొడుకును. కానీ నన్ను రాజ్యలక్ష్మి దగ్గర వదిలేశారు. రాజ్యలక్ష్మియే నా తల్లి అనుకున్నా. కాని పసివాడి ప్రాణం సినిమా చూశాక నిజం తెలిసింది. దీనిపై నాలుగేళ్లు దర్యాప్తు చేశా… అందులో చిరంజీవి తండ్రి అని తేలింది. ఇప్పుడు కొడుకుగా నా చేయి పట్టుకోవాలి లేకుండా డీఎన్‌ఏ పరీక్ష కోసం హైకోర్టు, సుప్రీం కోర్టు, జాతీయ మానవహక్కుల కమిషన్ వరకు వెళ్తా అని సుజిత్ చెప్పాడు. అంతేకాదు …
అల్లు అరవింద్ గురించి ఏం చెప్పాడంటే…”10 ఏళ్ల క్రితం అల్లు అరవిందు ఖరీదైన హోటల్‌కు తీసుకెళ్లి కాఫీ తాగించారు. నీ హైట్ ఎంత అని అడిగారు. 5.6 అన్నాను. ఆయన హైట్ కూడా అంతే అని అల్లుఅరవింద్ చెప్పారు. ఆయన అంటే ఎవరు అని అడిగాను. కాఫీ తాగు చెబుతా అన్నాడు. ఫస్ట్ పసివాడి ప్రాణం సినిమా చూడు అని చెప్పారు. నేను అన్న అని సంబోంధించాను. అప్పుడు అరవింద్ గారు నేను అన్నను కాదు మామను అవుతా అని చెప్పారు. నాకు చిరంజీవి తండ్రి అని తెలిసిన తర్వాత ఇప్పుడు నాకో నీడ కావాలి. 200 రూపాయలు లేక రాత్రి రోడ్డుపై పడుకున్నా. చిరు కొడుకునై ఉండి రోడ్డు మీద పడుకోవాలా?. నన్ను మానవత్వంతో స్వీకరించండి. ఆర్థిక సాయం చేస్తే తీసుకుంటా. కానీ బలవంత పెట్టను. డబ్బు కన్నా నాకు చిరు ప్రేమ కావాలి” అని చెప్పుకొచ్చాడు.
అంతే కాదు తను ఇప్పటి వరకు 80 సినిమాల్లో నటించాడట. దావూద్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నానని చెప్పాడు. ఎనిమిది నెలల క్రితం తాను ప్రసాద్ ల్యాబ్‌లో ఉండగా సురేఖ వచ్చి ”బిడ్డా ఇంటికి వెళ్ధాం పదా” అని పిలిచారని సుజిత్ అలియాస్ రవీంద్ర చెబుతున్నాడు. చిన్నప్పుడు పవన్ కల్యాణ్ తనను ఎత్తుకుని ముద్దాడేవాడని చెప్పాడు. పసివాడి ప్రాణం సినిమాలో నటించింది తానేనని… కొందరు కావాలని ఆ సినిమాలో నటించింది అమ్మాయి అని ప్రచారం చేస్తున్నారని అంటున్నాడు. డీఎన్‌ఏ పరీక్ష చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నాడు. అయితే పోలీసులు మాత్రం ఇతడి మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నారు.
Also Read: కమల్‌కి చెల్లిగా పుడతా: షకీలా