జనతా గ్యారేజీ సెంటిమెంటుకు రిపేరు చేస్తుందా?
జనతా గ్యారేజీ ఇది కొరటాల శివ దర్శకత్వంలో ఎన్‌టీఆర్ చేస్తున్న సినిమా టైటిల్. ఇక్కడ అన్నిరిపేర్లు చేయబడును.. బండ్లకు, మనుషులకు అన్నది క్యాప్షన్. ఇటీవల ఇవి లీక్ అయ్యాయి. టైటిల్ కంటే.. క్యాప్షన్ వెరైటీగా ఉందని అంతా మెచ్చుకుంటున్నారు. హిట్ సినిమాల దర్శకుడిగా మంచి ఊపుమీదున్నాడు.. కొరటాల శివ.. టెంపర్ సినిమాతో మళ్లీ విజయాట బాట పట్టాడు ఎన్టీఆర్. దీంతో వీరిద్దరి కాంబినేషనల్‌లో రూపొందుతున్న జనతాగ్యారేజీపై ప్రేక్షకుల్లో ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఒక […]
BY sarvi6 Nov 2015 12:34 AM IST
X
sarvi Updated On: 6 Nov 2015 7:03 AM IST
జనతా గ్యారేజీ ఇది కొరటాల శివ దర్శకత్వంలో ఎన్‌టీఆర్ చేస్తున్న సినిమా టైటిల్. ఇక్కడ అన్నిరిపేర్లు చేయబడును.. బండ్లకు, మనుషులకు అన్నది క్యాప్షన్. ఇటీవల ఇవి లీక్ అయ్యాయి. టైటిల్ కంటే.. క్యాప్షన్ వెరైటీగా ఉందని అంతా మెచ్చుకుంటున్నారు. హిట్ సినిమాల దర్శకుడిగా మంచి ఊపుమీదున్నాడు.. కొరటాల శివ.. టెంపర్ సినిమాతో మళ్లీ విజయాట బాట పట్టాడు ఎన్టీఆర్. దీంతో వీరిద్దరి కాంబినేషనల్‌లో రూపొందుతున్న జనతాగ్యారేజీపై ప్రేక్షకుల్లో ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఒక చిన్న అనుమానం ఇటు తెలుగు ఇండస్ర్టీని, అటు ఎన్జీఆర్‌ను కలవరపెడుతోందట.
మెకానిక్‌గా కనిపిస్తే..!
హీరో మెకానిక్‌గా కనిపిస్తే.. కమర్షియల్ హిట్ కాదన్నది తెలుగు సినిమా సెంటిమెంట్. గతంలో జూనియర్ మెకానిక్‌గా కనిపించిన అశోక్ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ఎన్టీఆర్ కూడా ఆందోళనగానే ఉన్నాడట. అయితే, కథలో ఉన్న బలం, కొరటాల దర్శకత్వంపై ఉన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు. ఇంతకాలం తెలుగుసినిమాలో హీరో మెకానిక్‌గా వచ్చిన సినిమాల్లో చాలా తక్కువగా విజయం సాధించాయి. కానీ ఈ సినిమాలో హీరో పాత్ర బండ్లకు, మనుషులతోపాటు.. తెలుగు ఇండస్ట్రీ మెకానిక్ సెంటిమెంట్‌ని కూడా రిపేరు చేస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉందట.
Next Story