Telugu Global
CRIME

బెంగళూరు బస్ లో యువతిపై రేప్

నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చిన మహిళలపై దాడులు ఆగటం లేదు. బెంగళూరులో ఇటీవలే నిర్భయలాంటి ఘటన జరిగింది. అది మరవక ముందే మరో దారుణం జరిగింది. బెంగళూరు శివారులో కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు బస్సు డ్రైవర్. ఈ సంఘటన సోలోబెలే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 19 ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిలిచుంది. కాసేపాగాక ఓ మిని బస్సు వచ్చింది. బస్సులో ఎవరు లేని విషయాన్ని […]

నిర్భయ చట్టాలు ఎన్ని వచ్చిన మహిళలపై దాడులు ఆగటం లేదు. బెంగళూరులో ఇటీవలే నిర్భయలాంటి ఘటన జరిగింది. అది మరవక ముందే మరో దారుణం జరిగింది. బెంగళూరు శివారులో కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు బస్సు డ్రైవర్. ఈ సంఘటన సోలోబెలే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
19 ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిలిచుంది. కాసేపాగాక ఓ మిని బస్సు వచ్చింది. బస్సులో ఎవరు లేని విషయాన్ని ఆ యువతి గమనించలేదు. మరోవైపు యువతి ఒక్కతే బస్సులో ఉండడంతో మిని బస్సు డ్రైవర్‌… క్లీనర్ ను బస్సు నడపాలని చెప్పి యువతిపై ఆఘాత్యానికి పాల్పడ్డాడు. అనంతరం యువతిని వసాకోటే ప్రాంతంలో పడేసి వెళ్లారు.
ఉదయం అపస్మారక స్థితిలో పడివున్న యువతిని గమనించిన స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణం జరిగిన సమయంలో మిని బస్సులో డ్రైవర్‌, క్లినర్‌ మాత్రమే ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్‌ను, అతనికి సహకరించిన క్లినర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మినీ బస్సును కూడా సీజ్ చేశారు.
First Published:  5 Nov 2015 6:31 PM IST
Next Story