Telugu Global
Others

వారసులకు లైన్ క్లియర్ చేస్తున్న జేసీ బ్రదర్స్

ఏ గాలి వీచినా ఎన్నడూ ఓటమి చూడని నేతగా జేసీ దివాకర్ రెడ్డి తన స్టామినా నిరూపించుకుంటూ వచ్చారు. ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రి రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అయితే ఇప్పుడు జేసీ బ్రదర్స్ తమ వారసులను తెరపైకి తెచ్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి,…. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిలు వచ్చే ఎన్నికల్లో రాజకీయ తెరంగేట్రం చేస్తారని చెబుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి […]

వారసులకు లైన్ క్లియర్ చేస్తున్న జేసీ బ్రదర్స్
X

ఏ గాలి వీచినా ఎన్నడూ ఓటమి చూడని నేతగా జేసీ దివాకర్ రెడ్డి తన స్టామినా నిరూపించుకుంటూ వచ్చారు. ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రి రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అయితే ఇప్పుడు జేసీ బ్రదర్స్ తమ వారసులను తెరపైకి తెచ్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి,…. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిలు వచ్చే ఎన్నికల్లో రాజకీయ తెరంగేట్రం చేస్తారని చెబుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపైనా జేసీ ఫ్యామిలీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిందని చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని చెబుతున్నారు. ఆయన స్థానంలో కుమారుడు పవన్ రెడ్డిని అనంతపురం ఎంపీ స్థానం నుంచి బరిలో దింపే యోచనలో జేసీ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పవన్ అనంతపురం లోక్‌సభ పరిధిలో పనిచేసుకుపోతున్నారు. తనకంటూ ఒక అనుచరగణం, ఒక బ్రాండ్‌ను తయారు చేసుకునే పనిలో ఉన్నారు. ఇటీవల అనంతపురం నగరంలో 29వ అంతర్జాతీయ ఒలంపిక్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒలంపిక్‌ రన్‌ అట్టహాసంగా నిర్వహించారు పవన్. ఈ రన్‌కు అజారుద్దీన్, ఎంఎస్‌కే ప్రసాద్, చేతన్ ఆనంద్, సినీ స్టార్స్ రానా, చార్మీ, రెజీనా లాంటి వారిని రప్పించి తన నెట్‌వర్క్ ఏ రేంజ్‌లో ఉందో చూపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం కాబట్టి పార్టీల పేరు మీద కాకుండా సొంతంగా ఈమేజ్‌‌ను పెంచుకుంటూ పోతున్నారు జేసీ పవన్. ప్రస్తుతం ఒలంపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెసి పవన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు

ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని జేసీ సన్నిహితులు చెబుతున్నారు. కొడుకుకు రాజకీయ గురువుగా జేసీ ప్రభాకర్ రెడ్డే వ్యవహరిస్తూ శిక్షణ ఇస్తున్నారు. ప్రజలతో, కార్యకర్తలతో ఎలా నడచుకోవాలన్న దానిపై తర్ఫీదు ఇస్తున్నారట. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో అనంతపురం ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ మధ్య అనంతపురం రాజకీయ వ్యవహారాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమేయం ఎక్కువైందని చెబుతున్నారు. ఈ ప్రయత్నంలోనే ప్రస్తుత అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ప్రభాకర్ రెడ్డికి మాటల తూటాలు పేలుతున్నాయని చెబుతున్నారు. రాజకీయ పార్టీల మద్దతు ఉన్నా లేకున్నా ఇండిపెండెంట్‌గానైనా గెలవగలిగే స్థాయిలో జేసీ బ్రదర్స్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.

Also Read: తవ్వుకున్న సీమ గోతిలో చంద్రబాబు

First Published:  6 Nov 2015 4:11 AM IST
Next Story