ఎప్పుడూ రెడ్‌లైట్ ఏరియాలో కూర్చోలేను కదా ?
సినిమా వాళ్ళంటే.. సోషల్‌గా మూవ్ కావలసి ఉంటుందని, పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతూ.. పరిచయాలు పెంచుకోవాలి అని చాలామంది అభిప్రాయం. ఇందులో కొంత వరకు నిజం కూడా ఉంది. కాని అందరూ అలాగే ఉండాలని కూడా లేదు! అలాంటి వారిలో ఒకరు డైరెక్టర్ గుణశేఖర్. ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువగా సోషల్‌గా మూవ్ కాడని అపప్రధ అతనిపై ఉంది. అందుకే అప్‌డేట్ కాలేక పోతున్నాడనే అనే టాక్ కూడా ఉంది. దీనిపై గుణశేఖర్ దగ్గర ఘాటైన జవాబే ఉంది. నేను […]
BY sarvi6 Nov 2015 12:37 AM IST
X
sarvi Updated On: 6 Nov 2015 9:56 AM IST
సినిమా వాళ్ళంటే.. సోషల్‌గా మూవ్ కావలసి ఉంటుందని, పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతూ.. పరిచయాలు పెంచుకోవాలి అని చాలామంది అభిప్రాయం. ఇందులో కొంత వరకు నిజం కూడా ఉంది. కాని అందరూ అలాగే ఉండాలని కూడా లేదు! అలాంటి వారిలో ఒకరు డైరెక్టర్ గుణశేఖర్. ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువగా సోషల్‌గా మూవ్ కాడని అపప్రధ అతనిపై ఉంది. అందుకే అప్‌డేట్ కాలేక పోతున్నాడనే అనే టాక్ కూడా ఉంది. దీనిపై గుణశేఖర్ దగ్గర ఘాటైన జవాబే ఉంది. నేను రెడ్‌లైట్ ఏరియాపై సినిమా తీయాలంటే … రెడ్‌లైట్ ఏరియాలో వెళ్ళి ఎప్పుడూ అక్కడే కూర్చోలేను కదా! సినిమాకు సంబంధించిన సమాచారం అవసరం మేరకు, తెలుసుకుంటే చాలు. అలాగే నేను అప్‌డేట్ అవ్వడానికి నాకు సోషల్ ఫంక్షన్స్ అవసరం లేదు. ఒక పుస్తకం 100 మంది అనుభవాలను పంచుతుంది. ఒక సినిమా 1000 మంది ఎక్స్‌పీరియెన్స్‌తో సమానం. నేను రోజుకొక బుక్ చదవటమో లేదా.. ఒక సినిమా తప్పకుండా చూడటమో చేస్తాను. ఆ బిజీలో నాకు సోషల్ లైఫ్ కి టైం లేదు అంటున్నాడు గుణ.
Next Story