Telugu Global
National

కుంబ్లే రికార్డ్ బద్ధలుకొట్టిన అశ్విన్

మొహాలీ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై…భారత బౌలర్లు చెలరేగిపోయారు…. వన్డే సిరీస్‌కు దూరమైన అశ్విన్..మొహాలీలో తన మార్క్‌ను చూపించాడు…ఫ్లైట్,గుగ్లీలతో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. మొహాలీలోనే తొలి ఇన్నింగ్స్ లో 5వికెట్లు తీసిన అశ్విన్.. 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. కేవలం 29వ టెస్ట్ లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా అశ్విన్ […]

కుంబ్లే రికార్డ్ బద్ధలుకొట్టిన అశ్విన్
X
మొహాలీ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై…భారత బౌలర్లు చెలరేగిపోయారు…. వన్డే సిరీస్‌కు దూరమైన అశ్విన్..మొహాలీలో తన మార్క్‌ను చూపించాడు…ఫ్లైట్,గుగ్లీలతో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. మొహాలీలోనే తొలి ఇన్నింగ్స్ లో 5వికెట్లు తీసిన అశ్విన్.. 150 వికెట్ల క్లబ్ లో చేరాడు. కేవలం 29వ టెస్ట్ లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా అశ్విన్ గుర్తింపు పొందాడు. గతంలో భారత్ తరుఫున ఈ రికార్డు అనిల్ కుంబ్లే, ఎర్రవల్లి ప్రసన్నల పేరుతో ఉండేది. వీరిద్దరూ 34 టెస్ట్ ల్లో 150 వికెట్లు పడగొట్టారు. భారత్ తరుఫున వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గానూ అశ్విన్ రికార్డు సృష్టించాడు.
నవంబర్ 6, 2011 లో వెస్టిండిస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన అశ్విన్ అతి తక్కువ కాలంలోనే 150 వికెట్ల ఘనతను సొంతం చేసుకున్న ఐదో బౌలర్ గా గుర్తింపు పొందాడు. అంతకుముందు ఈ ఘనతను సాధించిన వారిలో హ్యూజ్ టే ఫీల్డ్(దక్షిణాఫ్రికా), ఇయాన్ బోధమ్ (ఇంగ్లండ్), డేల్ స్టెయిన్(సౌతాఫ్రికా), సయీద్ అజ్మల్ (పాకిస్థాన్) ఉన్నారు. వీరంతా 29 టెస్టు మ్యాచ్ ల్లోనే 150 వికెట్ల ఘనతను సాధించారు.
First Published:  6 Nov 2015 3:43 PM IST
Next Story