Telugu Global
Others

సారిక కేసులో అంతుచిక్కని అంశాలు ఇవే

మాజీ ఎంపీ రాజయ్య కోడలు, మనవళ్ల సజీవ దహనం కేసులో కొన్ని అంశాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాటిని చేధించే పనిలోనే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు కొన్ని అంశాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ వల్లే ఘోరం జరిగిందన్న దానిపై స్పష్టత వచ్చింది. అయితే గ్యాస్ ఎలా లీక్ అయిందన్న దానిపై మాత్రం క్లారిటీకి రాలేకపోతున్నారు. సారిక గదిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వాటి నుంచి గ్యాస్ పూర్తిగా లీక్ […]

సారిక కేసులో అంతుచిక్కని అంశాలు ఇవే
X

మాజీ ఎంపీ రాజయ్య కోడలు, మనవళ్ల సజీవ దహనం కేసులో కొన్ని అంశాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాటిని చేధించే పనిలోనే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు కొన్ని అంశాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ వల్లే ఘోరం జరిగిందన్న దానిపై స్పష్టత వచ్చింది. అయితే గ్యాస్ ఎలా లీక్ అయిందన్న దానిపై మాత్రం క్లారిటీకి రాలేకపోతున్నారు.

సారిక గదిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వాటి నుంచి గ్యాస్ పూర్తిగా లీక్ అయిపోయింది. గ్యాస్ మొత్తం లీక్ అయిన తర్వాతే మంటలు చెలరేగాయని అందుకే సిలిండర్లు పేలలేదని భావిస్తున్నారు. సారిక గదిలో ఉన్నవి అదనపు సిలిండర్లు అని భావించేందుకు వీలు లేదు. ఎందుకంటే వంట గదిలోకి వెళ్లి చూస్తే అక్కడ సిలిండర్ లేదు. కేవలం రెగ్యులేటర్ మాత్రమే ఉంది. అంటే వంట గదిలో ఉండాల్సిన సిలిండరే సారిక గదిలోకి వచ్చిందని అనుమానిస్తున్నారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ చేయాలంటే రెగ్యులేటర్ అవసరమవుతుంది. రెగ్యులేటర్ సాయం లేకుండానే గ్యాస్ లీక్ చేయాలంటే బలప్రయోగం తప్పని సరి. కాబట్టి ఎవరో బలవంతంగా గ్యాస్‌ను బయటకు వదిలి హత్యకు కుట్ర చేశారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. అంతేకాదు సారిక, ఆమె పెద్దకుమారుడి మృతదేహాలు తలుపు వద్ద పడి ఉన్నాయి. అంటే మంటలు చెలరేగగానే సారిక తలుపు తెరిచేందుకు ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రయత్నంలో వారు ఎందుకు విఫలమయ్యారన్న దానిపైనా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు. ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు వస్తే అసలేం జరిగిందన్న దానిపై ఒక నిర్ధారణకు రావచ్చని పోలీసులు చెబుతున్నారు.

First Published:  5 Nov 2015 9:36 AM GMT
Next Story