టీ హబ్ ప్రారంభం
“కొత్త ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి” అనే నినాదంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టీహచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ ను ఏర్పాటు చేశారు. దేశంలోనే ప్రభుత్వం రంగంలో నిర్మితమైన తొలి ఇంక్యుబేటర్ సెంటర్ ఇదే. టీ హబ్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఐటీ మంత్రి కేటీ రామారావుసహా పలువురు ఐటీ ప్రముఖులు హాజరయ్యారు. టీ హబ్ […]
BY sarvi5 Nov 2015 3:21 PM IST
X
sarvi Updated On: 6 Nov 2015 6:47 AM IST
“కొత్త ఆలోచనలతో రండి ఆవిష్కరణలతో వెళ్లండి” అనే నినాదంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టీహచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ ను ఏర్పాటు చేశారు. దేశంలోనే ప్రభుత్వం రంగంలో నిర్మితమైన తొలి ఇంక్యుబేటర్ సెంటర్ ఇదే. టీ హబ్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఐటీ మంత్రి కేటీ రామారావుసహా పలువురు ఐటీ ప్రముఖులు హాజరయ్యారు. టీ హబ్ భారత్ కు ముఖద్వారం అవుతుందని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని స్టార్టప్‌లకు రాజధానిగా తీర్చి దిద్దుతామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. టీ హబ్ దేశంలోని యువతకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. త్వరలోనే టీ హబ్-2ను కూడా ప్రారంభిస్తామన్నారు.
టీ హబ్ ఎందుకు?
టీ హబ్‌లో దాదాపు 100 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వారి వారి అవసరాలను బట్టి క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ కేటాయిస్తారు. కెఫ్టేరియా, ఉత్సాహపరిచే రీతిలో ఇంటిరీయర్ డిజైనింగ్, స్ఫూర్తి కలిగించేలా ప్రముఖుల సూక్తులు, ఆసక్తికరమైన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. కాటలిస్ట్‌లో ఒక్కో స్టార్టప్‌కు ఏడాదిపాటు సమయం ఇస్తారు. ఆ సమయం తర్వాత వారి ఆలోచన సఫలం కాకపోతే నిరాశపడకుండా ఐఎస్‌బీ ద్వారా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ అందజేస్తారు.
ఐటీరంగంలో కాకుండా హెల్త్‌కేర్ విభాగంలో కూడా ఇక్కడ ఆలోచనలకు అవకాశం ఇస్తారు. టీ హబ్‌లో ఇప్పటికే 120 స్టార్టప్‌లకు అవకాశం ఇవ్వగా.. మరో 200 కంపెనీలు అనుమతికోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. టీహబ్ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న 10 కోట్ల రూపాయల నిధిని 100 మిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Next Story