కోన, రాజమౌళి ఒప్పేసుకున్నారుగా
కొంతకాలంగా క్రియేటివిటి చూపిద్దామనుకుంటున్న మన దర్శకుల గుట్టు సోషల్ మీడియా, ఇంటర్నెట్ పుణ్యమాని ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఏ సినిమా ట్రయిలర్ లేదా వాల్‌పోస్టర్ విడుదలైనా అది ఫలానా భాషలోని సినిమా కాపీ అంటూ వాటి మాతృకలు వెంటనే సోషల్‌మీడియాలో పెట్టేస్తున్నారు సినీ విమర్శకులు. దీంతో దర్శకులు బహిరంగంగా తాము కాపీ కొట్టామని ఒప్పుకోకపోయినా.. స్ఫూర్తిగా తీసుకుంటున్నామని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బాహుబలి దర్శకుడు రాజమౌళి చెన్నైలో ఇటీవల జరిగిన ఓ సదస్సులో తాను హాలీవుడ్ సినిమాలను కాపీ […]
BY sarvi5 Nov 2015 4:37 AM IST
X
sarvi Updated On: 5 Nov 2015 10:42 AM IST
కొంతకాలంగా క్రియేటివిటి చూపిద్దామనుకుంటున్న మన దర్శకుల గుట్టు సోషల్ మీడియా, ఇంటర్నెట్ పుణ్యమాని ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఏ సినిమా ట్రయిలర్ లేదా వాల్‌పోస్టర్ విడుదలైనా అది ఫలానా భాషలోని సినిమా కాపీ అంటూ వాటి మాతృకలు వెంటనే సోషల్‌మీడియాలో పెట్టేస్తున్నారు సినీ విమర్శకులు. దీంతో దర్శకులు బహిరంగంగా తాము కాపీ కొట్టామని ఒప్పుకోకపోయినా.. స్ఫూర్తిగా తీసుకుంటున్నామని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బాహుబలి దర్శకుడు రాజమౌళి చెన్నైలో ఇటీవల జరిగిన ఓ సదస్సులో తాను హాలీవుడ్ సినిమాలను కాపీ కొడతానని అందరిముందు అంగీకరించిన విషయం తెలిసిందే! తాజాగా కోన వెంకట్ కూడా తాను కొత్త ప్రాజెక్టు శంకరాభరణం సినిమాను బాలీవుడ్‌లో 2010లో విడుదలైన ఫస్‌గయారే ఒబామాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తీశామని వెల్లడించారు.
కొత్తేం కాదు..!
కొన వెంకట్ సినిమాలు కొత్తగా ఏముండవు. గతంలో విడుదలైన సినిమాల్లోలాగానే ఉంటాయి. కానీ, టైమింగ్, స్క్రీన్‌ప్లే బలంగా ఉండటం వల్ల ఆయన పనిచేసిన సినిమాలు ఎక్కువగా హిట్ అవుతుంటాయి. కోన పనిచేసిన సినిమాలన్నీ గుడంబా శంకర్ కథను పోలిఉంటాయి. హీరోయిన్ లేదా హీరోకు ఓ విలన్ వల్ల ఆపద వస్తుంది. హీరో ఆ విలన్ ఇంట్లో చేరి కామెడీ చేసి చివరికి అతని ఆట కట్టించడంతో కథ సుఖాంతమవుతుంది. ఇదే నేపథ్యంతో ఢీ, రెడీ, దూకుడు సినిమాల కథలు ఉంటాయి. ది ఎ-టీమ్ అనే హాలీవుడ్ సినిమాలో హీరో లియామ్ నీసన్ చెప్పిన డైలాగులను దూకుడు సినిమాలో మక్కికి మక్కీ దించాడు కోన. కోన వెంకట్ గీతాంజలితో తన రెగ్యులర్ ఫార్మాట్ మార్చాడు. ఈ హర్రర్ కామెడీతో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా క్లయిమాక్స్‌లో దెయ్యం వచ్చి విలన్‌ను చంపే సన్నివేశం ఓంశాంతిఓం సినిమా క్లయిమాక్స్‌ను గుర్తుకు తెస్తుంది. అయితే కోన తన రెగ్యులర్ ఫార్మాట్‌ను మార్చినా.. శ్రీనువైట్ల మార్చలేదు. ఆగడు, బ్రూస్‌లీకి పాత ఫార్ములాతోనే ముందుకెళ్లి అపజయాల్ని మూటగట్టుకున్నాడు.
కేసుల గండం పొంచి ఉంది..!
ఇలాంటి సినిమాకు మాతృకలతో లీగల్ గా చిక్కులు ఎదురయ్యే సమస్య ఉంది. స్వేచ్ఛానువాదం చేస్తే ఏమీ కాదు కానీ, మక్కీకి మక్కీ దించితే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సొంత కథ అని చెప్పి తెలుగునిర్మాతను బురిడీ కొట్టించినంత సులువేం కాదు.. గతేడాది తెలుగులో విడుదలైన ఓ అగ్ర హీరో సినిమా తమ సినిమాను కాపీ కొట్టి నిర్మించారని ఓ బాలీవుడ్ నిర్మాత అతనికి లీగల్ నోటీసులు పంపారు. మొదట అలాంటిదేం లేదని వాదించిన తెలుగు అగ్రహీరో తరువాత లీగల్ గా ప్రొసీడ్ కాలేకపోయాడట. కోర్టు దాకా వెళితే పరువు పోతుందని బయటే సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. దాదాపు రూ. 90 లక్షలు చెల్లించడంతో వారు కేసు వేయకుండా వెనుదిరిగారు. దీంతో సినిమా విజయం సాధించినా.. ఈ సెటిల్‌మెంట్‌తో ఎంతో కుంగిపోయాడు.
Next Story