అప్పటి వరకు భారత్‌లో అడుగు పెట్టను
మతం, గోమాంసం పేరుతో కొద్దికాలంగా దేశంలో జరుగుతున్న అవాంచనీయ పరిణామాలు భారత్ పరువు తీస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఇప్పటికే దేశంలో ఎందరో మేధావులు, రచయితలు తమ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ గజల్ సింగర్ గులాం అలీ కూడా నిరసన తెలిపిన వారి జాబితాలో చేరిపోయారు. ఇటీవల ముంబైలో తను నిర్వహించిన కార్యక్రమానికి శివసేన కార్యకర్తలు ఆటంకాలు కలిగించిన నేపథ్యంలో గులాం అలీ శపథం పూనారు. ఇక్కడి పరిస్థితుల్లో మార్పు […]
మతం, గోమాంసం పేరుతో కొద్దికాలంగా దేశంలో జరుగుతున్న అవాంచనీయ పరిణామాలు భారత్ పరువు తీస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఇప్పటికే దేశంలో ఎందరో మేధావులు, రచయితలు తమ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ గజల్ సింగర్ గులాం అలీ కూడా నిరసన తెలిపిన వారి జాబితాలో చేరిపోయారు.
ఇటీవల ముంబైలో తను నిర్వహించిన కార్యక్రమానికి శివసేన కార్యకర్తలు ఆటంకాలు కలిగించిన నేపథ్యంలో గులాం అలీ శపథం పూనారు. ఇక్కడి పరిస్థితుల్లో మార్పు వచ్చేంత వరకు భారత్‌లో అడుగు పెట్టబోనని ప్రకటించేశారు. ఇప్పటికే ఇండియాలో ఫిక్స్ అయిన తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇండియాలో సంగీత ప్రియులు తనను ఎంతగానో అభిమానిస్తున్నారని ఇది చూసి కొందరు నేతలు ఓర్వలేకపోతున్నారని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు . భారత్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని గులాం చెప్పారు. మరికొద్ది రోజుల్లో లక్నో, ఢిల్లీలో గులాం అలీ తన సంగీత కచేరి నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.