Telugu Global
Cinema & Entertainment

స‌ర్దార్ కు పోలీసుల వివాదం

2012లో విడుద‌లైన గ‌బ్బ‌ర్‌సింగ్ ద‌శాబ్దకాలంగా హిట్‌లేక క‌ట‌క‌ట‌లాడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చింది. ఈ చిత్ర విజ‌యంతో తానేంటో మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు క‌ల్యాణ్‌. అయితే, ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ఓ ఆప‌ద వ‌చ్చింది. సినిమా సెన్సార్‌కు వెళ్ల‌క‌ముందే పోలీసుల నుంచి అభ్యంత‌రం వ‌చ్చింది. అదేంటంటే.. సినిమాలో గ‌బ్బ‌ర్ సింగ్ పాత్ర‌లో క‌నిపించిన ప‌వ‌న్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్. అత‌డి వేష‌ధార‌ణ విచిత్రంగా, కొత్త‌గా ఉంది. పోలీసుగా క‌నిపించే ప‌వ‌న్ రెండు బెల్టులు, బొత్తాలు […]

స‌ర్దార్ కు పోలీసుల వివాదం
X
2012లో విడుద‌లైన గ‌బ్బ‌ర్‌సింగ్ ద‌శాబ్దకాలంగా హిట్‌లేక క‌ట‌క‌ట‌లాడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చింది. ఈ చిత్ర విజ‌యంతో తానేంటో మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు క‌ల్యాణ్‌. అయితే, ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ఓ ఆప‌ద వ‌చ్చింది. సినిమా సెన్సార్‌కు వెళ్ల‌క‌ముందే పోలీసుల నుంచి అభ్యంత‌రం వ‌చ్చింది. అదేంటంటే.. సినిమాలో గ‌బ్బ‌ర్ సింగ్ పాత్ర‌లో క‌నిపించిన ప‌వ‌న్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్. అత‌డి వేష‌ధార‌ణ విచిత్రంగా, కొత్త‌గా ఉంది. పోలీసుగా క‌నిపించే ప‌వ‌న్ రెండు బెల్టులు, బొత్తాలు గాలికి వ‌దిలేసి, టోపీ తీసి త‌ల‌కు ఎర్ర‌టి తుండుగుడ్డ చుట్టుకోవ‌డం చేశాడు. ఇవ‌న్నీ కూడా పోలీసు యూనిఫారం నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. పోలీసు శాఖలో యూనిఫాంకు అత్యంత గౌరవం, విలువ ఉన్నాయని, వీటిని కించపరిచే రీతిలో గబ్బర్‌సింగ్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ నటించారని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు చలపతి రావు అప్ప‌ట్లో విలేక‌రుల స‌మావేశం పెట్టి మ‌రీ ఆరోపించారు.
దృశ్యాలు తొల‌గించాల్సిందే..!
ప‌వ‌న్ పోలీసు శాఖ‌ను కించ‌ప‌రిచేలా యూనిఫారంను ధ‌రించిన దృశ్యాల‌ను క‌చ్చితంగా తొల‌గించాల్సిందేన‌ని చలపతి రావు అప్ప‌ట్లో గ‌ట్టిగానే డిమాండ్ చేశారు. ఆయ‌న విష‌యాన్ని అంత‌టితో వ‌దిలేయ‌లేదు. త‌మ అభ్యంత‌రాల‌ను సెన్సార్ బోర్డు దృష్టికి కూడా తీసుకెళ్లారు. సెన్సార్ బోర్డు స‌భ్యులు కూడా ఆయ‌న విన‌తికి సానుకూలంగా స్పందించారు. దీంతో సినిమా నిర్మాత‌ల గుండెల్లో రాళ్లు ప‌డ్డ‌ట్ల‌యింది. హుటా హుటాన మేల్కొని పోలీసు సంక్షేమ సంఘం అధికారుల‌తో మాట్లాడారు. సినిమా కేవ‌లం వినోదం కోస‌మేన‌ని, త‌మ‌కు మ‌రో ఉద్దేశం లేద‌ని వారికి స‌ర్ది చెప్పారు. పోలీసులంటే త‌మ‌కు అపార గౌర‌వం ఉంద‌ని వివ‌రించారు. పోలీసు సంక్షేమ సంఘానికి భారీగా విరాళం కూడా ఇచ్చారు. ఎట్ట‌కేల‌కు పోలీసు సంక్షేమ సంఘం అనుమ‌తించ‌డంతో సినిమా విడుద‌ల‌కు మార్గం సుగ‌మమైంది.
రెండు రాష్ట్రాల్లో..!
అప్పుడంటే.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌. ఒకటే సంఘం. ఒక‌టే రాష్ట్రం. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. ఇప్పుడు రెండు పోలీసు సంఘాలు, రెండు సినిమా సెన్సార్‌బోర్డులు అభ్యంత‌రం చెబితే.. ప‌రిస్థితి ఏంటి? అని ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ న‌డుస్తోంది. ఈసారి రెండు రాష్ర్టాల పోలీసుల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాలి. వారికి వివ‌ర‌ణ ఇవ్వాలి. వారు అభ్యంత‌రం చెబితే..మాత్రం సినిమాలో చాలా వ‌ర‌కు స‌న్నివేశాలు తొల‌గించాల్సి వ‌స్తుంది. దీంతో ఈసారి చిత్ర నిర్మాత‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
First Published:  4 Nov 2015 12:38 AM IST
Next Story