Telugu Global
NEWS

వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సర్వే పేరు ఖరారు

వరంగల్ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్థానంలో మరో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సర్వే సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించాల్సి ఉంది. వరంగల్‌ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వ్యవహారాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌ సర్వే సత్యనారాయణకు ఫోన్‌ చేసి కోరారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కె. జానారెడ్డి, షబ్బీర్‌ అలీ సర్వే సత్యనారాయణను […]

వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సర్వే పేరు ఖరారు
X

వరంగల్ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్థానంలో మరో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సర్వే సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించాల్సి ఉంది. వరంగల్‌ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వ్యవహారాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌ సర్వే సత్యనారాయణకు ఫోన్‌ చేసి కోరారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కె. జానారెడ్డి, షబ్బీర్‌ అలీ సర్వే సత్యనారాయణను కలిసి ఆయనను పోటీకి ఒప్పించారు. అయన అంగీకరించడంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బీ-ఫారం తీసుకుని వరంగల్‌ వెళ్ళారు. నామినేషన్‌ వేయడానికి సర్వే సత్యనారాయణకు కూడా వరంగల్‌ వెళ్ళారు. ఈరోజే నామినేషన్లకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్‌ నాయకులంతా వరంగల్‌కు వెళుతున్నారు. వరంగల్‌ వెళ్ళిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిఅక్కడే సర్వే సత్యనారాయణ పేరును అధికారికంగా ప్రకటించి బీ-ఫారం అందజేస్తారని తెలిసింది. తన కోడలు, ముగ్గురు మనవళ్ళు బుధవారం తెల్లవారుజామున సజీవ దహనమయిన నేపథ్యంలో ఆవేదనకు గురయిన రాజయ్య తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. తాను వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయలేనని, తనను క్షమించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాను కోరుతూ రాజయ్య ప్రకటన చేశారు. దారుణమైన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారు. పోటీ నుంచి రాజయ్యను మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన తనకు తానుగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఈ మరణాల వెనుక కారణాలు ఏమైనప్పటికీ రాజయ్య రాజకీయ జీవితానికి తెర పడినట్టయ్యింది.

First Published:  4 Nov 2015 6:15 AM IST
Next Story