Telugu Global
Cinema & Entertainment

ఈ సారైనా  స్వాతి సుడి తిరిగేనా

మ‌న టాలీవుడ్ తెలుగ‌మ్మాయిలను దూరంగా పెట్టి  కేర‌ళ కుట్టిల‌కూ, చెన్నై చంద్రమా, ముంబై ముద్దుగుమ్మల‌కీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అదేమంటే మ‌నోళ్లు హాటుగా క‌నిపించ‌రు.. అంటూ ఏదోటి క‌హాని చెబుతారు. అయితే తెలుగులో మ‌న క‌ల‌ర్స్‌ స్వాతి మంచి న‌టి. డేంజ‌రు చిత్రంతో తెలుగులో నటిగా ప‌రిచ‌య‌మైన స్వాతి త‌మిళంలో తొలినాళ్లలో సుబ్రహ్మణ్యపురం సినిమాతో న‌టిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో స్వాతి సుడి తిరుగుతుంది అనుకున్నారంతా. పాపం.. ఈ స్వాతి న‌క్షత్రం మ‌హేష్‌.. అంటూ […]

ఈ సారైనా  స్వాతి సుడి తిరిగేనా
X

మ‌న టాలీవుడ్ తెలుగ‌మ్మాయిలను దూరంగా పెట్టి కేర‌ళ కుట్టిల‌కూ, చెన్నై చంద్రమా, ముంబై ముద్దుగుమ్మల‌కీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అదేమంటే మ‌నోళ్లు హాటుగా క‌నిపించ‌రు.. అంటూ ఏదోటి క‌హాని చెబుతారు. అయితే తెలుగులో మ‌న క‌ల‌ర్స్‌ స్వాతి మంచి న‌టి. డేంజ‌రు చిత్రంతో తెలుగులో నటిగా ప‌రిచ‌య‌మైన స్వాతి త‌మిళంలో తొలినాళ్లలో సుబ్రహ్మణ్యపురం సినిమాతో న‌టిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో స్వాతి సుడి తిరుగుతుంది అనుకున్నారంతా. పాపం.. ఈ స్వాతి న‌క్షత్రం మ‌హేష్‌.. అంటూ అష్టాచెమ్మా చిత్రంలో అలా అంద‌రి మ‌దిని ఆక‌ట్టుకుని క‌ల‌వ‌ర‌మాయే మ‌దిలో చిత్రం క‌నిపించ‌కుండా పోయింది. ద‌ర్శక‌,నిర్మాత‌లంతా స్వాతి న‌ట‌న అదుర్స్ అన్నారంతా. అవ‌కాశాలు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆ స‌మ‌యంలో త‌మిళం, మ‌ళ‌యాళ చిత్రాల‌పైనే ఆశ‌లు పెట్టుకుని బ‌తికింది. తెలుగులో కామియోరోల్స్ కే ప‌రిమిత‌మైంది. ఇక క‌ల‌ర్స్ స్వాతికి బ్లాక్ అండ్ వైట్ డేసే అనే స‌మ‌యంలో రెండేళ్ల కితం కొత్త ద‌ర్శకుడు సుధీర్ వ‌ర్మ అనే కొత్త ద‌ర్శకుడు స్వామిరారా చిత్రంతో ఆమెకు లైఫ్ ఇచ్చాడు. దీంతో మ‌ళ్లీ టాలీవుడ్ పై ఆశ‌లు పెట్టుకుంది. ఆ త‌ర్వాత కార్తికేయ చిత్రంలో ఓకే అనిపించుకుంది. ఇక తెలుగులో అవ‌కాశాలు రావ‌ని ఫిక్సయి మ‌ళ్లీ కోలీవుడ్‌, మాలీవుడ్ చూపులు చూస్తున్న స్వాతి తాజాగా త్రిపుర చిత్రంలో న‌టించింది. గీతాంజ‌లి ద‌ర్శకుడు రాజ్ కిర‌ణ్ రూపొందించిన ఈ చిత్రం ఈ వీకెండ్ రిలీజ్ అవుతోంది. హార‌ర్ థ్రిల్లర్‌లో స్వాతి న‌ట‌న ప్రధాన హైలైట్ అంటున్నాడు ద‌ర్శకులు రాజ్ కిర‌ణ్‌. అన్నట్లు ఈ మూవీలో స్వాతి కాస్త బోల్డ్ గా న‌టించిందట‌. మ‌రి త్రిపుర చిత్రంలో న‌ట‌న‌తో పాటు ఈ బోల్డ్ త‌నాన్ని చూసైనా స్వాతికి అవ‌కాశాలు వ‌స్తాయా.. అస‌లు మునుప‌టిలా మ‌ళ్లీ పొరుగుంటి వైపు చూడకుండా సొంతింట్లోనే స్వాతి హ‌ల్చల్ చేస్తుందో లేదో చూడాలి మ‌రి.

First Published:  4 Nov 2015 2:36 PM IST
Next Story