Telugu Global
Cinema & Entertainment

శంక‌రాభ‌ర‌ణం క‌థ ఇదేనా?

శంక‌రాభ‌ర‌ణం సినిమాలో హీరో నిఖిల్ ఓ ఎన్ ఆర్ ఐ. అమెరికాలో రిసిసెష‌న్ రావ‌డంతో వ్యాపారంలో బాగా న‌ష్టం వ‌స్తుంది. వాటిని పూడ్చుకునేందుకు త‌మ పూర్వీకులు ఇండియాలో కూడ‌బెట్టిన ఆస్తులను అమ్ముకోవాల‌ని డిసైడ‌వుతాడు హీరో. బిహార్‌లో ఉన్న ఆస్తుల‌ను వీలైనంత త్వ‌ర‌గా విక్ర‌యించి అమెరికా వెళ్లిపోదామ‌న్న ఉద్దేశంతో ఆ రాష్ర్టానికి బ‌య‌ల్దేరుతాడు. బీహార్‌లో ఉన్న వారి ఆస్తుల‌ను అమ్మ‌నీయ‌కుండా స్థానికంగా ఉన్న ఫ్యాక్ష‌నిస్టులు ఎందుకు అడ్డుకున్నారు?  నిఖిల్‌కు ఎలాంటి అడ్డంకులు సృష్టించారు?  వారికి హీరోకి ఉన్న వైర‌మేంటి? […]

శంక‌రాభ‌ర‌ణం క‌థ ఇదేనా?
X
శంక‌రాభ‌ర‌ణం సినిమాలో హీరో నిఖిల్ ఓ ఎన్ ఆర్ ఐ. అమెరికాలో రిసిసెష‌న్ రావ‌డంతో వ్యాపారంలో బాగా న‌ష్టం వ‌స్తుంది. వాటిని పూడ్చుకునేందుకు త‌మ పూర్వీకులు ఇండియాలో కూడ‌బెట్టిన ఆస్తులను అమ్ముకోవాల‌ని డిసైడ‌వుతాడు హీరో. బిహార్‌లో ఉన్న ఆస్తుల‌ను వీలైనంత త్వ‌ర‌గా విక్ర‌యించి అమెరికా వెళ్లిపోదామ‌న్న ఉద్దేశంతో ఆ రాష్ర్టానికి బ‌య‌ల్దేరుతాడు. బీహార్‌లో ఉన్న వారి ఆస్తుల‌ను అమ్మ‌నీయ‌కుండా స్థానికంగా ఉన్న ఫ్యాక్ష‌నిస్టులు ఎందుకు అడ్డుకున్నారు? నిఖిల్‌కు ఎలాంటి అడ్డంకులు సృష్టించారు? వారికి హీరోకి ఉన్న వైర‌మేంటి? వాటిని అధిగ‌మించి హీరో ఆస్తుల‌ను ఎలా అమ్మాడు? అన్న‌ది సినిమా క‌థ అని ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంతో ఇప్ప‌టికే మ‌ర్యాద రామ‌న్న‌, పూల‌రంగ‌డు సినిమాలు వ‌చ్చాయి. అవి రెండూ బంపర్ హిట్లుగా నిలిచాయి. ఇక్క‌డ ర‌చ‌యిత కోన‌వెంక‌ట‌న్ కావ‌డంతో యాక్ష‌న్ + కామెడీ నేప‌థ్యంతో రూపొందిన ఈ క‌థ‌పై అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.
ప‌క్క రాష్ట్రం వెళితే సినిమా హిట్టే!
తెలుగు సినిమాలో విదేశాల‌కు వెళ్లిన క‌థ‌ల్లో సింహ‌భాగం బొక్క‌బోర్లా ప‌డ్డాయి.కానీ, ప‌క్క రాష్ట్రం వెళ్లిన ప్ర‌తి సినిమాల‌న్నీ 90 శాతం హిట్‌గానే నిలిచాయి. బీహార్ నేప‌థ్యంతో విడుద‌లైన ఆంధ్రుడు (2005) క‌మ‌ర్షియ‌ల్ హిట్ కాక‌పోయినా.. గోపీచంద్ మాస్ ఇమేజ్‌ను మ‌రింత‌ పెంచింది. త‌రువాత వ‌చ్చిన ఛ‌త్ర‌ప‌తి (2005)లోనూ బీహార్ విల‌న్లు సినిమాను పెద్ద హిట్ చేశారు. అదే ఊపుతో విక్ర‌మార్కుడు (2006) పూర్తి బీహార్ నేప‌థ్యంతో వ‌చ్చి సెన్సేష‌న‌ల్ హిట్ అయింది. కాకుంటే కిక్‌-2 (2015), ఓయ్ (2009) చిత్రాలు మాత్రం భారీ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నాయి. కిక్‌-2, ఓయ్ సినిమా క‌థ‌లో లోపాలే కార‌ణం. మిగిలిన సినిమాల‌న్నీ మంచి విజ‌యం సాధించాయి. మ‌రి శంక‌రాభ‌ర‌ణం ఏ మేర‌కు అల‌రిస్తుందో చూడాలి!
First Published:  4 Nov 2015 12:48 AM IST
Next Story