Telugu Global
Editor's Choice

నాడు 'పులిరాజా' సార‌ధి... నేడు ఆనందానికి వార‌ధి

దాదాపు ప‌న్నెండేళ్ల క్రితం పులిరాజాకి ఎయిడ్స్ వ‌స్తుందా… అంటూ దూసుకొచ్చిన‌ ఎయిడ్స్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న చాలా పాపుల‌ర్‌ అయింది.. దాన్ని  రూపొందించి ప్ర‌జ‌ ల్లోకి తీసుకువెళ్లిన టీమ్‌లో ముఖ్యులు చాగంటి సంజ‌య్ రావు. ఢిల్లీలో పుట్టి, చెన్నైలో చదువుకున్నారు. పాపులేషన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ (ఆరోగ్య అంశాలపై ప్రపంచ స్థాయిలో అర‌వై అయిదు దేశాల్లో త‌న కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న స్వచ్ఛంద సంస్థ)లో ఆసియా తూర్పు యూరప్ దేశాలకు సీనియర్ రీజనల్ అడ్వయిజర్‌గా, ఫ్యామిలీ ప్లానింగ్, ఎయిడ్స్ నియంత్రణ అంశాలపై […]

నాడు పులిరాజా సార‌ధి... నేడు ఆనందానికి వార‌ధి
X

దాదాపు ప‌న్నెండేళ్ల క్రితం పులిరాజాకి ఎయిడ్స్ వ‌స్తుందా… అంటూ దూసుకొచ్చిన‌ ఎయిడ్స్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న చాలా పాపుల‌ర్‌ అయింది.. దాన్ని రూపొందించి ప్ర‌జ‌ ల్లోకి తీసుకువెళ్లిన టీమ్‌లో ముఖ్యులు చాగంటి సంజ‌య్ రావు. ఢిల్లీలో పుట్టి, చెన్నైలో చదువుకున్నారు. పాపులేషన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ (ఆరోగ్య అంశాలపై ప్రపంచ స్థాయిలో అర‌వై అయిదు దేశాల్లో త‌న కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న స్వచ్ఛంద సంస్థ)లో ఆసియా తూర్పు యూరప్ దేశాలకు సీనియర్ రీజనల్ అడ్వయిజర్‌గా, ఫ్యామిలీ ప్లానింగ్, ఎయిడ్స్ నియంత్రణ అంశాలపై ప‌నిచేశారు. .ప్రపంచాన్ని చుట్టేశారు. ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన ఆరోగ్య‌, సామాజిక ప్ర‌యోజ‌న‌ అంశాల‌ను, వ‌స్తువుల‌ను త‌న ప్ర‌చార కార్య‌క్ర‌మాల ద్వారా తీసుకువెళ్ల‌గ‌ల సోష‌ల్ మార్కెటింగ్ నిపుణుడు.

me and buddhaఅలాంటి మార్కెటింగ్ గురుగా ఉన్న ఈయన తరువాత కాలంలో ఓ మోటివేషనల్ స్పీకర్‌గా మారిపోయారు. ఒకప్పుడు తెలివైన వాడిని అనుకున్నా…అందుకే ప్రపంచాన్ని మార్చాలనుకున్నాను. ఇప్పుడు జ్ఞానమున్న మ‌నిషిని అనుకుంటున్నా…అందుకే నన్నునేనే మార్చుకోవాలనుకుంటున్నాను అంటున్నారు ఆయన. నాడు పులిరాజా ప్ర‌చారానికి సార‌ధిగా ప‌నిచేసిన సంజ‌య్, నేడు ప్ర‌జ‌ల‌కు, ఆనందానికి వార‌ధిగా మారానంటున్నారు.

సాధారణంగా భూమిలో నీళ్లు, నూనెలు, రత్నాలు, ఖనిజాలు, బొగ్గు లాంటివన్నీ ఎక్కడ ఉన్నాయో భూగర్భ శా స్త్రాన్ని అధ్యయనం చేసినవారు చెబుతుంటారు. అలాగే సంజయ్ మన మనసుల్లోపల అడుగున ఎక్కడో ఇంకి పోయి ఉన్న ఆనందాన్ని ఎలా పైకి తీయాలో చెబుతారు. చిన్నతనంలో కళలు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న తనకు పెద్దవుతున్న కొద్దీ ఇతరులను సంతోషంగా ఉంచడంలో ఆనందం ఉందనే విషయం అర్థమైందంటారు. తమ జీవితాల్లో మార్పుని ఆశిస్తున్నవారికి తాను సహాయం చేసేందుకు సిద్దంగా ఉంటానంటారు ఆయన. మన ప్రతి చర్యని ప్రపంచం పరిశీలిస్తూ ఉంటుంది, ఏ చిన్న పొరబాటు చేసినా ఎత్తి చూపేందుకు సిద్ధంగా ఉంటుంది. విమర్శలు గుప్పిస్తుంది. అందుకే మన ఆలోచనలు పరిమితమై పోతాయి. మనం మారాలంటే ఆ పరిమితులను చెదరగొట్టాలి అంటారాయన. జీవితంలో సంతోషాలను తెచ్చుకునేందుకు ఉపయోగపడే మరిన్ని ఆయన మాటలు –

  • కొన్నేళ్ల క్రితం నా స్నేహితుని మరణం, చేస్తున్న పనిలో వచ్చిన ఒడిదుడుకులతో ఏం చేయాలో పాలుపోలేదు. జీవితం ఆగిపోయినట్టుగా అనిపించింది. నాకంటూ ఓ ఆశయం లేదనిపించింది. అంతేకాదు, నా జీవితంలో ఓ పూడ్చలేని వెలితి ఏర్పడినట్టుగా కూడా ఫీలయ్యాను. ఆ అయోమయం నుండి బయటపడేందుకు అయిదు సంవత్సరాలు పట్టింది. అప్పటినుండి నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. మనుషుల్లో ఆనందాన్ని పెంచే బాధ్యతను చేపట్టాను. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన సంస్కృతులను అధ్యయనం చేశాను.
  • 1980ల్లో నెలకోసారి మన ఫ్రిజ్‌ను స్విచ్ఛాఫ్ చేసి లోపల ఉన్న‌వ‌న్నీ బ‌య‌ట‌కు తీసేసి కొత్త‌వాటితో తిరిగి ఫ్రిజ్‌ని నింపేవాళ్లం. ఇప్ప‌టి ఫ్రిజ్‌ల‌కు అలా డీ ఫ్రాస్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. అందువ‌ల‌న అక్క‌ర్లేనివి, ప‌నికిరానివి కూడా ఫ్రీజ‌ర్‌లో ఉండిపోయి మంచి ఆహారాన్ని సైతం పాడుచేస్తున్నాయి. ఇది మ‌న మైండ్‌కు సైతం వ‌ర్తిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న కార్య‌క‌లాపాల‌ను స‌మీక్షించుకుని అక్క‌ర్లేని వాటిని బ‌య‌ట‌కు పంప‌క‌పోతే ఆ అక్క‌ర్లేని ఆలోచ‌న‌లు, న‌మ్మ‌కాలు లోపల ఉండిపోయి జీవితంలో ఆనందం అనేది లేకుండా పోతుంది.
  • ఐక్యూకంటే మ‌న స్వీయ నిర్వ‌హ‌ణ‌, ఇత‌రుల‌తో మ‌న సంబంధ బాంధ‌వ్యాల‌ను నిర్వ‌చించే ఇక్యూనే గొప్ప‌ది. లైఫ్‌స్కిల్స్‌, సామాజిక నైపుణ్యాలు మ‌న అభివృద్ధిలో చాలా కీల‌కం. ముఖ్యంగా కార్పొరేట్ లీడ‌ర్ షిప్‌కి ఇవి చాలా ముఖ్యం. అందుకే ప‌శ్చిమ దేశాల‌న్నీ ఇప్పుడు ఎమోష‌న‌ల్ ఇంటెలిజెన్స్‌, ఎమోష‌న‌ల్ కోషెంట్ గురించే మాట్లాడుతున్నాయి.
  • ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే మీకు జీవితంలో ఏమేం ఉన్నాయో, ఏమేం ద‌క్కాయో గుర్తు తెచ్చుకోండి. ఇది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ సాధ‌న‌. ఆనందానికి రాజ‌మార్గాల్లో ఇదీ ఒక‌టి.
  • మీకు వీల‌యినంత‌గా ఇత‌రుల‌కు స‌హాయం చేయండి. ఇత‌రుల‌కు ఇవ్వ‌డం అనేది మ‌న‌లో నింపే సంతృప్తికి సాటి మ‌రేదీ రాదు. ఇంకా చెప్పాలంటే ఇత‌రుల‌కు స‌హాయం చేయ‌డం అంటే మ‌న‌ల్నిమ‌నం నింపుకోవ‌డం.
  • మీకు న‌చ్చిన ప‌నిని చేయ‌డానికి ఎంత‌ కాలాన్న‌యినా నిర‌భ్యంత‌రంగా వెచ్చించండి. అది మీ విలువ‌ని పెంచుకోవ‌డం అవుతుంది.
  • యోగా మ‌న‌కు అద్భుత‌మైన ఎమోష‌న‌ల్ ఇంట‌లిజెన్స్‌ని ఇస్తుంది. మొత్తం 196 యోగా సూత్రాల్లో ఓ ప‌దికంటే త‌క్కువే ఆస‌నాలు, ధ్యానం, ప్రాణాయామం గురించి చెబుతాయి. మిగిలివ‌న్నీ మ‌న మ‌న‌సు‌పై, భావోద్వేగాల‌పై ప‌ట్టు ఎలా సాధించాలో వివ‌రిస్తాయి.

-వి.డి

First Published:  3 Nov 2015 11:33 PM IST
Next Story