అల్లు అరవింద్ వలన చెర్రీ, సురేందర్ రెడ్డి మధ్య దూరం ..?
కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్. కృష్ణ వంశీతో గోవిందుడు అందరివాడేలే , ఆగడుతో ఫ్లాప్ చవిచూసిన శ్రీనువైట్లతో బ్రూస్‌లీ చేసిన విషయం తెలిసిందే! కిక్-2తో డిజాస్టర్ రుచి తెలుసుకున్న సురేందర్‌రెడ్డిని తనిఒరువన్ రీమేక్ కు దర్శకుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా హక్కులు రామ్ చరణ్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమాకు నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న చరణ్‌కు మావయ్య […]
కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్. కృష్ణ వంశీతో గోవిందుడు అందరివాడేలే , ఆగడుతో ఫ్లాప్ చవిచూసిన శ్రీనువైట్లతో బ్రూస్‌లీ చేసిన విషయం తెలిసిందే! కిక్-2తో డిజాస్టర్ రుచి తెలుసుకున్న సురేందర్‌రెడ్డిని తనిఒరువన్ రీమేక్ కు దర్శకుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా హక్కులు రామ్ చరణ్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమాకు నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న చరణ్‌కు మావయ్య అరవింద్ ఓ సలహా ఇచ్చాడట.. అదేంటంటే.. ఫ్లాప్ డైరెక్టర్లతో నువ్వు చేసిన రెండు సినిమాలు ఆడలేదు కాబట్టి, ఈ సినిమాకు సురేందర్ రెడ్డిని తప్పించు అని. ఆ స్థానాన్ని తని ఒరువన్ సినిమా తమిళ వర్షన్ దర్శకుడు మోహన్ రాజాకు అప్పజెప్పమని సూచించాడట. దీంతో ఈ సినిమా నుంచి సురేందర్ రెడ్డిని తప్పిస్తారా? అన్న టాక్ అప్పుడే ఫిలింనగర్‌లో మొదలైంది.
చెర్రీ మాట నిలబెట్టుకుంటాడా?
ఈ సినిమాకు దర్శకుడిగా సురేందర్ రెడ్డినే ఏరికోరి ఎంచుకున్నాడు చెర్రీ. అలాంటిది ఇప్పుడు మావయ్య సలహాతో డైలమాలో పడ్డాడు. ఇప్పుడు ఇండస్ర్టీ అంతా సురేందర్‌రెడ్డిని తప్పిస్తారా? లేదా ఇచ్చినమాట ప్రకారం.. కొనసాగిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, తన పెద్దకుమారుడు అల్లు అర్జున్‌కు రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డిని అరవింద్ ఎందుకు తప్పించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. హీరోలను అత్యంత స్టయిలిష్‌గా చూపించడంలో సురేందర్‌రెడ్డి దిట్ట. టేకింగ్, టెక్నాలజీని వాడటంలోనూ సురేందర్‌రెడ్డిది అందె వేసిన చేయి. ఈ విషయంలో తానేమిటో.. తొలిసినిమా అతనొక్కడేతోనే నిరూపించుకున్నాడు. కానీ, మెజారిటీ ప్రజలు మాత్రం చెర్రీ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి అని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడని బలంగా వాదిస్తున్నారు.