Telugu Global
POLITICAL ROUNDUP

రాష్ట్ర ప్రభుత్వ భూ వ్యాపారాన్ని అడ్డుకోండి

రాష్ట్ర ప్రభుత్వ బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా నవంబర్‌ 16, 17,18 తేదీలలో అన్ని భూ పోరాట కేంద్రాలలో సత్యాగ్రహాలు చేయాలని, నవంబర్‌ 20 నుండి 30 తేదీల మధ్య ఆయా మండల కార్యాలయాల ముట్టడి నిర్వహించాలని ఆంద్రప్రదేశ్‌ భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిస్తుంది. ఈ రోజు వంగల సుబ్బారావు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం దాసరి నాగభూషణరావు భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వదేశీ, విదేశీ బహుళ జాతీ […]

రాష్ట్ర ప్రభుత్వ భూ వ్యాపారాన్ని అడ్డుకోండి
X

రాష్ట్ర ప్రభుత్వ బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా నవంబర్‌ 16, 17,18 తేదీలలో అన్ని భూ పోరాట కేంద్రాలలో సత్యాగ్రహాలు చేయాలని, నవంబర్‌ 20 నుండి 30 తేదీల మధ్య ఆయా మండల కార్యాలయాల ముట్టడి నిర్వహించాలని ఆంద్రప్రదేశ్‌ భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిస్తుంది. ఈ రోజు వంగల సుబ్బారావు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం దాసరి నాగభూషణరావు భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వదేశీ, విదేశీ బహుళ జాతీ సంస్థలకు కార్పొరేట్‌ కంపెనీలకు పరిశ్రమల పేరుతో రైతులు, పేదల భూములు కొల్లగొట్టి దోచిపెట్టడాన్ని, లక్షలాది ఎకరాలు రైతులు, పేదల సాగు చేసుకుంటున్న భూములను గుంజుకొని భూ బ్యాంక్‌ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. రాష్ట్రం అభివృద్ధికి, పరిశ్రమలకు పోరాటా కమిటీ వ్యతిరేకం కాదు, కానీ రాష్ట్రంలో ఏ పరిశ్రమకు ఎంత భూమి కావాలి, ఎక్కడ ఏ పరిశ్రమ పెడుతున్నారో స్పష్టంగా ప్రభుత్వం తెలియజేసి వాటి అవసరానికి ఎంత భూమి కావాలో అంతే తీసుకోవాలి. అదే విధంగా సామాజిక ప్రభావ అంచనాను ప్రకటించిన తరువాతే భూ సేకరణ చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటిని ప్రక్కకు నెట్టి 2013 భూ చట్టాని ఉల్లంఘించి అవసరానికి మించి అనేక రెట్లు భూమి గుంజు కొని ప్రభుత్వం భూ వ్యాపారానికి పూనుకున్నది. అనేక చోట్ల ఇప్పటికే లక్షలాది ఎకరాల భూములు తీసుకొని రైతులకు, వ్యవసాయ కార్మికులకు నష్టపరిహారం ఇవ్వకుండానే అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలో పనులు మొదలు పెట్టారు. నిలదీసిన రైతు, వ్యవసాయ కార్మికులపై అక్రమ కేసులు పెడుతున్నారు. వెంటనే పనులు విరమించి రైతు, కూలీల ఆమోదం పొందాలని డిమాండ్‌ చేసారు.

ఈ భూముల పరిరక్షణ కోసం ఇప్పటికే 25 ప్రజాసంఘాలు, మేధావులతో టి.గోపాల్‌ రావు గారి నాయకత్వంలో (కొనేరు రంగారావు భూ కమిటీ సభ్యులు) కమిటీ ఏర్పడి పోరాటానికి పూనుకున్నది. ఇదే పద్దతులో అన్ని జిల్లాలో ప్రభుత్వ బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే అందరితో జిల్లా కమిటీలు వేసి పోరాటాం నిర్వహిస్తామని, కాబట్టి నవంబర్‌ 16, 17,18 తేదీలలో దీక్షలను 25-30 మధ్య జరిగే మండల కార్యాలయాల ముట్టడిలో ప్రజాస్వామిక వాధులు, సంఘాలు, సంస్థలు, మేధావులు ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ భూ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, రైతులకు, వ్యవసాయ కార్మికులకు తగిన న్యాయం జరిగే వరకు పోరాటం నిర్వహించాలని రాష్ట్ర భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది.

First Published:  4 Nov 2015 2:30 AM IST
Next Story