Telugu Global
CRIME

అక్క,బావ, ఓ బామ్మర్ది... దొంగతనాల కథ

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు కొత్త కాపురాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. కష్టపడటం మానేసి ఏం చేయాలో తెలియక దొంగతనాలనే ఉద్యోగంగా మార్చుకున్నారు. వారికి తోడుగా యువతి తమ్ముడిని కూడా చేర్చుకున్నారు. ఇదీ కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లికి చెందిన నాగరాజు, లక్ష్మిల కథ. వీళ్ల పాపం పండి తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నాగరాజు, లక్ష్మిఅనే ఈ జంట పని కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలియక […]

అక్క,బావ, ఓ బామ్మర్ది... దొంగతనాల కథ
X

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు కొత్త కాపురాన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. కష్టపడటం మానేసి ఏం చేయాలో తెలియక దొంగతనాలనే ఉద్యోగంగా మార్చుకున్నారు. వారికి తోడుగా యువతి తమ్ముడిని కూడా చేర్చుకున్నారు. ఇదీ కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లికి చెందిన నాగరాజు, లక్ష్మిల కథ. వీళ్ల పాపం పండి తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగరాజు, లక్ష్మిఅనే ఈ జంట పని కోసం ప్రయత్నించినా దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలియక డబ్బు కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. కర్నాటకలో చిన్నచిన్న చోరీలు చేస్తూ జీవనం సాగించారు. వీరిపై పలు కేసులు నమోదు కావడంతో అక్కడ పోలీసుల నిఘా పెరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా ఇద్దరూ తిరుపతికి మకాం మార్చారు. అక్కడ ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ కూడా దొంగతనాలనే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. తాళం వేసిన ఇళ్లే ఈ జంట టార్గెట్. ఉదయం పూట రెక్కీ నిర్వహించడం.. రాత్రిళ్లు ఇనుపరాడ్లతో తాళాలు బద్ధలుకొట్టి నగలు, నగదూ, వాహనాలు దోచుకెళ్లడం ఇదీ వారి ప్రవృత్తి.

తిరుపతిలో నాలుగైదు చోరీలు చేసిన వీరికి మరింత ఆశపుట్టింది. వారికి తోడు యువతి తమ్ముడిని కూడా కలుపుకున్నారు. ముగ్గురూ దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టారు. దొంగతనం చేసిన సొమ్ముతో జల్సాలు చేస్తూ వచ్చారు. అలా ఏకంగా మూడు నెలల్లో 17 దొంగతనాలు చేశారు. దీంతో పోలీసులు వీరిని మోస్ట్ వాంటెడ్‌ లిస్ట్ లో చేర్చారు. ఈ గ్యాంగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. చివరకు ఎమ్మార్ పల్లిలోని అవిలాల చెరువు దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముగ్గురి నుంచి 19 లక్షల విలువైన బంగారం, నాలుగు కేజీల వెండి, లక్షా 46వేల రూపాయల నగదు, రెండు టీవీలు, బైక్, పట్టుచీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడిన నాగరాజు, లక్ష్మితోపాటు వారికి సహాయపడిన వ్యక్తి కూడా ఇప్పుడు జైలు జీవితం గుడుపుతున్నారు.

First Published:  2 Nov 2015 9:00 PM GMT
Next Story