దావూద్‌కు రక్షణ పెంచిన పాక్
వంటింట్లో స్విచ్ వేస్తే.. వాకిట్లో లైట్ వెలుగుతుంది అంటే ఇదేనేమో! ఎక్కడో మలేసియాలో మాఫియాడాన్ చోటా రాజన్ అరెస్టవడం, అతన్ని భారత్‌కు తీసుకురావడానికి ఇండియా పోలీసులు వెళ్లడంతో పాక్ అప్రమత్తమైంది. అతను ఇండియాకు వస్తే.. దావూద్ ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న ఆందోళనలో మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంకు పాక్ భద్రత పెంచిందని నిఘా వర్గాల సమాచారం. కరాచీ, ఇస్లామాబాద్‌లో ఉన్న దావూద్ ఇళ్ల వద్ద పాకిస్తాన్ సైన్యం ప్రత్యేక కమాండోలతో పహారా కాస్తోందని భారత నిఘావర్గాలకు విశ్వసనీయ సమాచారం […]
వంటింట్లో స్విచ్ వేస్తే.. వాకిట్లో లైట్ వెలుగుతుంది అంటే ఇదేనేమో! ఎక్కడో మలేసియాలో మాఫియాడాన్ చోటా రాజన్ అరెస్టవడం, అతన్ని భారత్‌కు తీసుకురావడానికి ఇండియా పోలీసులు వెళ్లడంతో పాక్ అప్రమత్తమైంది. అతను ఇండియాకు వస్తే.. దావూద్ ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న ఆందోళనలో మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంకు పాక్ భద్రత పెంచిందని నిఘా వర్గాల సమాచారం. కరాచీ, ఇస్లామాబాద్‌లో ఉన్న దావూద్ ఇళ్ల వద్ద పాకిస్తాన్ సైన్యం ప్రత్యేక కమాండోలతో పహారా కాస్తోందని భారత నిఘావర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. ఇన్నాళ్లూ దావూద్ తమ వద్ద లేడని చెబుతూ వస్తోన్న పాక్ మరోసారి గుమ్మడికాయ దొంగ చందంగా భుజాలు తడుముకోవడం విశేషం.. చోటా రాజన్ అరెస్టు వార్త విన్నప్పటి నుంచి దావూద్, ఐఎస్ ఐ వెన్నులో వణుకు పుడుతోందట..!
ఎందుకు ప్రత్యేక రక్షణ!
భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ గూఢచార సంస్థ ( ఐ ఎస్ ఐ) హస్తముందని ప్రపంచానికి తెలసినా అదెప్పుడూ ఒప్పుకున్న పాపాన పోలేదు. భారత్‌లో చొరబడిన ప్రతి ఉగ్రవాదికి నగదు, ఆయుధాలు సరఫరా చేసే పని దావూద్ ముఠా చూసుకుంటుంది. అందుకే దావూద్‌ను ఆయుధంగా వాడుకుంటూ మనవేలితో మన కంటినే పొడుస్తోంది.. ఐ ఎస్ ఐ. భారత్‌ను అస్థిర పరచాలన్న తన ప్రణాళికకు దావూద్ అండదండలు అందిస్తుండటంతో అతని రక్షణ బాధ్యతను పాక్ తన భుజాలకెత్తుకుంది. అందుకే దావూద్ బద్ద శత్రువు చోటారాజన్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే.. దావూద్ చావుకు భారత్ నిఘా సంస్థలు ముహూర్తం పెట్టాయన్న ఆందోళన పాక్‌లో రేగుతోంది. 2008లో దుబాయ్‌లోని ఓ హోటల్లో దావూద్ కూతురు వివాహం జరిగింది. ఆ వేడుక సమాచారం ముందే తెలుసుకున్న భారత ఐబీ చోటారాజన్ మనుషులతో కలిసి దావూద్ ను అదే వేడుకలో అంతమొందిచాలని స్కెచ్ వేసింది. ఈ విషయం బయటపడింది. రాజన్ అరెస్టుతో భారత్‌లోని దావూద్ మనుషుల్లోనూ కలవరం మొదలైందని సమాచారం. పాక్‌లో తన మిత్రుల ద్వారా దావూద్‌ని కాల్చి చంపాలని రాజన్ గతంలో ప్లాన్ వేసినా అవి వర్కవుట్ కాలేదు. అందుకే పాక్‌లో అతనికి నేరుగా ఆర్మీనే రక్షణ కల్పిస్తోందట.