Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ అంటే వీరికి లెక్కలేదా..?

మంచి స్టార్ డమ్ ఉన్నప్పుడు సంప్రదిస్తే ఛీ పొమ్మంటారు. అసలు కన్నెత్తి చూడ్డానికి కూడా చిరాకుపడతారు. కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గినా అప్పుడు అందరికీ టాలీవుడ్ గుర్తొస్తుంది. బాలీవుడ్ భామల మైండ్ సెట్ కు చిన్న ఎగ్జాంపుల్ ఇది. హిందీలో డిమాండ్ ఉన్నప్పుడు బాలీవుడ్ భామలెవరూ తెలుగువైపు చూడరు. ఎంత మంచి కథ చెప్పినా వినిపించుకోరు. ఎంత ఇస్తామన్నా పట్టించుకోరు. కానీ అక్కడ ఒక్క ఫ్లాప్ తగిలితే తెలుగు సినిమా గుర్తొస్తుంది.  బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన పాత్రను […]

టాలీవుడ్ అంటే వీరికి లెక్కలేదా..?
X

మంచి స్టార్ డమ్ ఉన్నప్పుడు సంప్రదిస్తే ఛీ పొమ్మంటారు. అసలు కన్నెత్తి చూడ్డానికి కూడా చిరాకుపడతారు. కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గినా అప్పుడు అందరికీ టాలీవుడ్ గుర్తొస్తుంది. బాలీవుడ్ భామల మైండ్ సెట్ కు చిన్న ఎగ్జాంపుల్ ఇది. హిందీలో డిమాండ్ ఉన్నప్పుడు బాలీవుడ్ భామలెవరూ తెలుగువైపు చూడరు. ఎంత మంచి కథ చెప్పినా వినిపించుకోరు. ఎంత ఇస్తామన్నా పట్టించుకోరు. కానీ అక్కడ ఒక్క ఫ్లాప్ తగిలితే తెలుగు సినిమా గుర్తొస్తుంది.

బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన పాత్రను శ్రీదేవికి వినిపించాడు జక్కన్న. కానీ శ్రీదేవి అప్పటికే హిట్ ఇచ్చిన కిక్ లో ఉంది. పైగా తమిళనాట పులి అనే సోషియో ఫాంటసీలో నటిస్తోంది. దీంతో రాజమౌళి చెప్పిన కథకు నో చెప్పింది. కట్ చేస్తే.. పులి సినిమాలో శ్రీదేవి పాత్రకు పాస్ మార్కులు కూడా పడలేదు. అటు బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. దీంతో తెలుగులో నటించాలనుకుంటోందట శ్రీదేవి. తాజాగా మాధురీదీక్షిత్, శ్రీదేవి లాంటి తారలు కూడా టాలీవుడ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు వీళ్లకు టాలీవుడ్ అంటే చిన్నచూపు ఉండేది. ఇప్పుడు మాత్రం వీళ్లకు తెలుగే కావాల్సి వస్తోంది.

మరో హీరోయిన్ పరిణీతి చోప్రా విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. గతంలో వంశీపైడిపల్లి, హరీష్ శంకర్ లాంటి దర్శకులు పరిణీతి చోప్రా కోసం ప్రయత్నించారు. కుదిరితే ఆమెతో తెలుగులో సినిమా చేయాలనుకున్నారు. కానీ పరిణీతి అప్పుడు మంచి స్వింగ్ లో ఉంది. కాబట్టి ఒప్పుకోలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె సీన్ రివర్స్ అయింది. అందుకే ఎన్టీఆర్ సరసన నటించే ఆలోచన చేస్తోంది. పరిణీతి మాత్రమే కాదు.. గతంలో ఎంతోమంది బాలీవుడ్ భామల విషయంలో ఇది నిజమైంది. హిందీలో అవకాశాల్లేకపోతేనే తెలుగులోకి వస్తామంటున్నారు భామలంతా. ఈ విషయం తెలిసి కూడా మన మేకర్స్.. సిగ్గులేకుండా వాళ్ల వెంటే పడుతుంటారు.

First Published:  3 Nov 2015 4:08 AM IST
Next Story