Telugu Global
Others

బెస్ట్‌ బ్రేక్ ఫాస్ట్... ఫర్‌ గుడ్‌ హెల్త్‌

బ్రేక్‌ ఫాస్ట్… ఇది మన పదం కాదు… మన అలవాటు కాదు… కాని ఆరోగ్యానికి మంచిది… ఆయుష్షును పెంచేది కాబట్టి దీన్ని మన ఆహారపు అలవాట్లలో ఒకటి చేసుకున్నాం. మనం రోజూ రకరకాల సమయాల్లో ఆహారం తీసుకుంటున్నాం. ఉదయం తీసుకునేది బ్రేక్‌ఫాస్ట్‌ అని, మధ్యాహ్నం తీసుకునేది లంచ్‌ అని, సాయంత్రం తీసుకునేది డిన్నర్‌ అని అంటున్నాం. ఇవన్నీ బ్రిటన్‌ నుంచి మనం దిగుమతి చేసుకున్న వ్యవహారాలే. రాత్రి డిన్నర్‌కు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌కు మధ్య 12 గంటలపాటు […]

బెస్ట్‌ బ్రేక్ ఫాస్ట్... ఫర్‌ గుడ్‌ హెల్త్‌
X

బ్రేక్‌ ఫాస్ట్… ఇది మన పదం కాదు… మన అలవాటు కాదు… కాని ఆరోగ్యానికి మంచిది… ఆయుష్షును పెంచేది కాబట్టి దీన్ని మన ఆహారపు అలవాట్లలో ఒకటి చేసుకున్నాం. మనం రోజూ రకరకాల సమయాల్లో ఆహారం తీసుకుంటున్నాం. ఉదయం తీసుకునేది బ్రేక్‌ఫాస్ట్‌ అని, మధ్యాహ్నం తీసుకునేది లంచ్‌ అని, సాయంత్రం తీసుకునేది డిన్నర్‌ అని అంటున్నాం. ఇవన్నీ బ్రిటన్‌ నుంచి మనం దిగుమతి చేసుకున్న వ్యవహారాలే. రాత్రి డిన్నర్‌కు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌కు మధ్య 12 గంటలపాటు నిరాహారంతో ఉంటాం. అంటే సుదీర్ఘ విరామం తర్వాత మనం ఫాస్టింగ్‌ని బ్రేక్‌ చేస్తున్నాం కాబట్టి దీనికి బ్రేక్‌ ఫాస్ట్‌ అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు.
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో బ్రేక్‌ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఉదయం పూట తినే ఆహారమే రోజంతా మనలో ఉత్తేజాన్ని నింపుతుంది. కనుక తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి ఆహారం ఉండేట్టు చూసుకోవాలి. బ్రేక్‌ ఫాస్ట్‌కి ఇడ్లీ చాలా మంచిది. అలాగే నూనె లేకుండా గోధుమ, జొన్న రోట్టెలు మిమ్మల్ని శక్తిమంతంగా ఉంచుతాయి. అలాగే రెండు గుడ్లు తినవచ్చు. అయితే ఇందులో ఉండే పచ్చసొనను తొలగిస్తే మంచిది. గుడ్లు నూనెలో వేయించి తీసుకోవద్దు. ఉడకబెట్టిన గుడ్డును పచ్చ సొనను తీసేసి తింటే ఆరోగ్యాన్ని సంరక్షించి శక్తిమంతంగా తయారు చేస్తుంది. అలాగే తాజా పళ్ళ రసాలు మంచి పోషకాహారం కింద భావించవచ్చు. కాఫీ, టీల కన్నా శ్రేష్టమైన పాలు తీసుకోవడం మంచిది.
క్యాలరీలు, ప్యాట్‌ పెంచేవి తీసుకోవద్దు
కేలరీలు ఎక్కువ ఉండే ఆహారం, ఫ్యాట్‌ ఎక్కువగా ఉండే ఆహారం ఉదయం పూట తీసుకోకుండా ఉంటే మంచిది. కేకులు, చక్కెర, వెన్నతో చేసినవి పొద్దున్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. కడుపులో ఇబ్బంది కలిగి అసౌకర్యానికి గురవుతారు. ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండటం ఉత్తమం. త్వరగా తయారవుతాయని టిఫిన్‌ కోసం కొందరు నూడుల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాని ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. వీటిల్లో సొడియం అధికంగా ఉంటుంది. ఇలాంటి మసాలా కలగలిసిన వాటిని తీసుకుంటే ఎండలో వెళ్ళినప్పుడు వికారంగా ఉంటుంది. సమయం చూసుకొని తేలిగ్గా అరిగే మామూలు అల్పాహారం తీసుకోవడం మంచిది. కొందరు రాత్రి మిగిలిన చికెన్‌ వంటకాలను మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయి. కొందరు పండ్ల రసాలను తయారు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ముందురోజు చేసిన వాటిని మర్నాడు ఉదయం తాగడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా చేరుతుంది. పోషకాలు సరిగా అందవు.

First Published:  3 Nov 2015 6:01 AM IST
Next Story