ప్రియాంక నటన హై లెట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాను తొలిసారిగా హాలీవుడ్ బుల్లితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన టెలివిజన్ సిరీస్ క్వాంటికో. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఇటీవల ప్రారంభమైన ఈ సిరీస్ కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రియాంక నటన ఈ సీరియల్ కు హైలైట్ అంటూ కితాబిస్తున్నారు హాలీవుడ్ విశ్లేషకులు. అయితే, హాలీవుడ్ బుల్లితెర మీద మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ లలో ఒకటిగా పేరు తెచ్చుకుంటున్న క్వాంటికో సిరీస్ కాపీ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాను తొలిసారిగా హాలీవుడ్ బుల్లితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన టెలివిజన్ సిరీస్ క్వాంటికో. భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఇటీవల ప్రారంభమైన ఈ సిరీస్ కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రియాంక నటన ఈ సీరియల్ కు హైలైట్ అంటూ కితాబిస్తున్నారు హాలీవుడ్ విశ్లేషకులు. అయితే, హాలీవుడ్ బుల్లితెర మీద మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ లలో ఒకటిగా పేరు తెచ్చుకుంటున్న క్వాంటికో సిరీస్ కాపీ అంటూ ఆరోపణలు వస్తున్నాయి.
1999లో సీఎన్ ఎన్ లో ప్రసారమైన ఓ అమెరికన్ సిరీస్ లోని ఐడియాను ఎలాంటి అనుమతి లేకుండా క్వాంటికో సిరీస్ కోసం వినియోగించుకున్నారంటూ నిర్మాత మార్క్ గోర్డాన్ పై కేసు నమోదైంది. సిఎన్ ఎన్ లో ప్రసారమైన సీరియల్ ను తెరకెక్కించిన జెమ్మి హెల్మన్, బార్బరా లెబోవిట్జ్ లు తన అభ్యంతరాలను తెలియజేస్తూ 35 పేజీల ఫిర్యాదును లాస్ ఏంజిల్స్ లోని సుపీరియర్ కోర్ట్ లో అందజేశారు.
ప్రియాంకా చోప్రా హాలీవుడ్ ఎంట్రీతో భారీ హైప్ క్రియేట్ అయిన ఈ టివి సిరీస్ ఎబిసి ఛానల్ లో ప్రసారం అవుతోంది. ఎఫ్ బిఐలో చేరిన కొంత మంది వ్యక్తుల కథగా ఈ సీరియల్ తెరకెక్కుతుంది. ఎఫ్ బిఐ ట్రైనింగ్ లో జాయిన్ కాకముందు వారి నేపథ్యంతో పాటు ట్రైనింగ్ లో వారు ఎలా ఉన్నారు, ట్రైనింగ్ తరువాత ఎలాంటి ఆపరేషన్స్ ప్లాన్ చేశారు అన్నదే క్వాంటికో కథ.