అయ్యయ్యో.. దానయ్యా..!
బ్రూస్‌లీ సినిమా మిగిల్చిన నష్టాలతో నిర్మాత దానయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. దీనికితోడు సినిమా ఓవర్ సీస్‌లో ఊహించని పరాజయాన్ని మూటగట్టుకోవడంతో బయ్యర్లు గోల చేస్తున్నారట. దసరా పండుగ, పైగా చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో భారీ రేట్లకు సినిమాను విక్రయించారు. రెండో రోజు నుంచే జనాలు పలచబడటంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారట. తమకు సినిమాను ఎక్కువ రేటుకు అంటగట్టారని, తమ డబ్బులు తమకు […]
BY sarvi2 Nov 2015 12:37 AM IST
X
sarvi Updated On: 2 Nov 2015 10:50 AM IST
బ్రూస్‌లీ సినిమా మిగిల్చిన నష్టాలతో నిర్మాత దానయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. దీనికితోడు సినిమా ఓవర్ సీస్‌లో ఊహించని పరాజయాన్ని మూటగట్టుకోవడంతో బయ్యర్లు గోల చేస్తున్నారట. దసరా పండుగ, పైగా చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో భారీ రేట్లకు సినిమాను విక్రయించారు. రెండో రోజు నుంచే జనాలు పలచబడటంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారట. తమకు సినిమాను ఎక్కువ రేటుకు అంటగట్టారని, తమ డబ్బులు తమకు వెనక్కి ఇవ్వాలని దానయ్యపై ఒత్తిడి చేస్తున్నారట. మూలిగే నక్కమీద తాటి పండు చందంగా.. సినిమా తీర్చలేని నష్టాలు మిగిల్చిందని దానయ్య కుమిలిపోతుంటే.. మరో పక్క తాము చెల్లించిన డబ్బులో కొంతైనా తిరిగి ఇవ్వాలని ఓవర్సీస్ మార్కెట్‌లో ఒత్తిడి రావడంతో దానయ్యకు దిక్కు తోచడం లేదట.
రామ్, శ్రీను డిసైడయ్యారట..
ఈ సినిమాకు రామ్ చరణ్, శ్రీను వైట్ల భారీగానే పారితోషికాలు తీసుకున్నారు. శ్రీను వైట్ల అయితే, ఏకంగా రూ.5 కోట్లు తీసుకున్నారని సమాచారం. బ్రూస్‌లీ సినిమా దానయ్యను ఆర్థికంగా తీవ్రమైన దెబ్బతీసిన నేపథ్యంలో వీరిద్దరూ అతనికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారట. తాము తీసుకున్న పారితోషికంలో కొంత మొత్తం దానయ్యకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నారని సమాచారం. ఇంతకుముందు గోవిందుడు అందరివాడేలే! సినిమా కూడా అట్లర్‌ప్లాప్ అయినపుడు పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాత బండ్ల గణేశ్‌ను చెర్రీ ఆదుకున్న విషయం తెలిసిందే. తాజాగా దానయ్య విషయంలోనూ చెర్రీ సహృదయంతో వ్యవహరించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని పరిశ్రమ వర్గాలు అభినందిస్తున్నాయి. మొత్తానికి రామ్, శ్రీను నిర్ణయంతో దానయ్యకు కాస్తయినా ఊరట దొరికేలా ఉంది.
Next Story